బీసీల ఆత్మగౌరవ భవనాలకు కోకాపేటలో స్థలం ఇచ్చి... నిధులు సమకూరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు ప్రత్యేక హోదా కల్పించారని మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. పెరిక కుల సంఘానికి సంబంధించిన ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను... తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
మాసబ్ ట్యాంక్‌లోని మీడియా అకాడమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... పెరిక కుల సంఘ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీనిచ్చారు.పెరిక కుల ఆత్మ గౌరవ భవనం కోసం కేటాయించిన స్థలం స్వాధీనానికి అనుమతులు... నిధుల విడుదల కొద్ది రోజుల్లో పూర్తవుతుందని తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు శ్రీరాం భద్రయ్య తెలిపారు. ప్రభుత్వం నుంచి కుల సంఘానికి చేకూరే లబ్ధిని ఐకమత్యంతో సాధించుకోవాలని సూచించారు.
- ఇదీ చదవండి: 'నెలాఖరులోగా ఉద్యోగుల పదోన్నతులు పూర్తి చేయాలి'