ETV Bharat / state

మేడ్చల్ జిల్లాలో ప్రజాతీర్పు ఎటువైపు - - కుత్బుల్లాపూర్ ప్రజాతీర్పు ఎటువైపు

Medchal Malkajgiri District Over All Political Review : ప్రజాతీర్పు ఈవీఎంలలో భధ్రంగా ఉంది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు తామే విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తంచేస్తున్నాయి. మేడ్చల్-మల్కాజ్​గిరి జిల్లాలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? ఎవరికి పట్టంకట్టనున్నారు..? జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో ఏపార్టీకి మెజార్టీ సీట్లు దక్కనున్నాయి..? అధికారపార్టీ అనుకున్న సీట్లు దక్కించుకుంటుందా..? హస్తం నేతలు చెప్పినట్లు వారి హవా కొనసాగుతుందా..? బీజేపీ ఏమేరకు ప్రభావం చూపనుంది..? మేడ్చల్ -మల్కాజ్ గిరీ జిల్లాపై ప్రత్యేక కథనం

Medchal-Malkajgiri District Review
Medchal-Malkajgiri District Over All Political Review
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 1:12 PM IST

Medchal- Malkajgiri District Over All Political Review : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్, మల్కాజ్​గిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్​పల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఐదు నియోజకవర్గాల్లో 126 మంది అభ్యర్థులు మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 28 లక్షల 19వేల 067 మంది ఓటర్లు ఉన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గంలో మొత్తం 4,63,864 మంది ఓటర్లుండగా.. నియోజకవర్గంలో పోలింగ్ 53.96 శాతం నమోదైంది. కూకట్​పల్లిలో బీఆర్​ఎస్​ అభ్యర్థి మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి బండి రమేష్, జనసేన నుంచి ప్రేమ్ కుమార్ ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

Kukatpally Constituency : కూకట్​పల్లి నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్​ఎస్​, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. మాధవరం కృష్ణారావు అన్ని పార్టీల నేతలతో కలుపుగోలుగా ఉంటారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తన సమీప బీఆర్​ఎస్​(టీఆర్​ఎస్​) అభ్యర్థి గొట్టిముక్కల పద్మారావుపై 43,186 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వ్యక్తిగతంగా అందరికి అందుబాటులో ఉండడం. నియోజకవర్గ ప్రజలందరికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు. కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం ఇస్తారనే పేరుంది.

ఎన్నికల్లో గెలిచేదెవరు? ఈసారి యువత, మహిళల ఓట్లు ఎటువైపు?

కృష్ణారావు తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగ్గా వింటారని, కలుపుగోలుగా మాట్లాడుతారని స్థానికుల్లో అభిప్రాయం ఉంది. బండి రమేశ్​కు స్థానికేతరుడని బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై పెద్దగా అవగాహన లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారినట్లు కన్పిస్తుంది. ప్రేమ్​కుమార్​కు పవన్​ కల్యాణ్​ ప్రచారం కలిసివస్తుందని ధీమా ఉంది.

Uppal Constituency Over All Political Review : ఉప్పల్ నియోజకవర్గంలో మొత్తం 5,29,416 మంది ఓటర్లుండగా.. పోలింగ్ 51.35 శాతం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి 32 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్​ఎస్​ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సోదరుడు రాజిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో చేసిన అభివృద్ది పనులతో పాటు బీఆర్ఎస్ గత 9 ఏళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ధీమాను పార్టీ శ్రేణులు వ్యక్తంచేస్తున్నాయి.

Uppal Constituency : కాంగ్రెస్ అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పోరేటర్ కావడంతో కొంత రాజకీయ అనుభవం ఉంది. బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్​కు స్థానిక అధికారుల్లో మంచి పేరుంది. స్థానిక యువజన సంఘాలు, కాలనీల్లోనూ అంతే పేరుంది. ఆర్ఎస్ఎస్ నేత కావడంతో బీజేపీ శ్రేణులు కూడా అతడి వెంటే ఉన్నారే ధీమా ఉంది. ఉద్యోగులు, యువకులు అనుకూలంగా ఉన్నారనే భావన ఉంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ది పనులే గెలిపిస్తాయనే ధీమాను వ్యక్తంచేస్తున్నారు.

గెలిచిన పార్టీకి హామీల అమలు కత్తిమీద సామే - అవసరాలకు తగిన రీతిలో ఆర్థిక రథాన్ని నడిపించడమెలా?

Medchal Constituency Over All Political Review : మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 6,37,839 మంది ఓటర్లుండగా.. పోలింగ్ 62.09 శాతం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి 22 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డిలు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది. చామకూర మల్లారెడ్డికి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభం కలిసివస్తుంది.

Medchal Constituency BRS Winnings Chances : మిగితా అభ్యర్థులతో చూసుకుంటే మల్లారెడ్డి కొంత మేలు అనే అభిప్రాయం ఉంది. తమ కళాశాలల సిబ్బంది, విద్యార్థులు నియోజకవర్గంలోనే ఉండడం వారి కుటుంబాల ఓట్లు ఖచ్చితంగా తమకే వేస్తారనే ధీమా ఉంది. మల్లారెడ్డి అనుచరులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఎన్నికల్లో మల్లారెడ్డిపై ప్రతికూల అంశాలుగా కన్పిస్తున్నాయి. పదవీకాలంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఎన్నికల్లో సొంత నిధులతో చేస్తున్న అని అంటున్నారనే ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి.

Mallareddy Winning Chances : కార్మిక శాఖ మంత్రిగా ఉండి విద్యాసంస్థల అధిపతిగా ఉండి మేడ్చల్​కు ఒక డిగ్రీ కళాశాల కూడా తీసుకురాలేకపోయారనే విమర్శ ఉంది. కిందిస్థాయి కార్యకర్తలను కలవరు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ముఖ్య బాధ్యతలను కుటుంబ సభ్యులకే ఇచ్చి పార్టీ కార్యకర్తలను, నాయకులను విస్మరించారని ఆరోపణలు ఉన్నాయి.

వజ్రేశ్​ యాదవ్​కు నియోజకవర్గంలో మంచిపేరే ఉంది. గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఇప్పుడు అది సానుభూతిగా మారిందనే అభిప్రాయం స్థానికంగా నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసి వస్తుందని వజ్రేశ్​ అనుచరులు అనుకుంటున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నేత హరివర్థన్​రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, నక్క ప్రభాకర్​గౌడ్​ల పూర్తి సహకారంతో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని వజ్రేశ్​యాదవ్ అనుచరులు అంటున్నారు.

బీజేపీ అభ్యర్థి సుదర్శన్​రెడ్డి గతంలో (బీఆర్​ఎస్​)టీఆర్​ఎస్​ తరఫున ఎంపీపీగా ఉన్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డికి మొదటగా మేడ్చల్ బీజేపీ టికెట్ ప్రకటించి ఆ తర్వాత రెండు గంటల్లోనే పేరు మార్చడంతో విక్రంరెడ్డి గ్రూపులో కొంత నిరుత్సాహం నిండుకుని క్షేత్రస్థాయిలో వారు సుదర్శన్​రెడ్డికి సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి.

మల్కాజ్​గిరి నియోజకవర్గంలో మొత్తం 4,89,043 మంది ఓటర్లుండగా.. పోలింగ్ 53.99 శాతం నమోదైంది. ఈ నియోజకర్గం నుంచి 33 మంది పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ అభ్యర్థి ఎన్ రాంచందర్​రావు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే తీవ్రమైన పోటీ నెలకొంది.

Malkajgiri Constituency : మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి అల్లుడు కావడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలవ్వడం పట్ల సానభూతి పనిచేస్తుంది. తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజా సేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు గట్టెక్కిస్తాయనే ధీమా ఉంది. అరుందతి ఆసుపత్రి పేరుతో నియోజకవర్గ ప్రజలందరికి ఉచిత వైద్యం అందిస్తానని ప్రధానమైన హామీనిచ్చారు. దీనిపై ప్రజల్లో నుంచి మంచి స్పందనే లభిస్తుంది. గత ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయిన తర్వాత మల్కాజ్​గిరి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదనే ఆరోపణ ఉంది.

కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుకి నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ తరపున విజయం సాధించారు. మల్కాజ్​గిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ద్విచక్ర వాహనంపై కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎక్కడిక్కడే అధికారులను పిలిపించి సమస్యలను సాధ్యమైనంతవరకు పూర్తయ్యేలా కృషిచేసేవారనే పేరుంది.

Malkajgiri Constituency BJP Winnings Chances : అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులను దూరం పెట్టారానే ప్రచారం స్థానికంగా ఉంది. తన కుమారుడు మైనంపల్లి రోహిత్ రెడ్డికి బీఆర్​ఎస్​ తరపున మెదక్ నియోజకవర్గం టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో మైనంపల్లి హన్మంతరావు ఆపార్టీని వీడారు.. బీజేపీ అభ్యర్థి ఎన్ రాంచందర్​రావుకు మంచి పేరుంది. అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండే నేతగా పేరుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతి ఉంది.

Quthbullapur Constituency Over All Political Review : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 6,99,130 మంది ఓటర్లుండగా, పోలింగ్ 56.74 శాతం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ అభ్యర్థి వివేకానంద్, కాంగ్రెస్ అభ్యర్థి హన్మంతరెడ్డి, బీజేపీ అభ్యర్థి శ్రీశైలం గౌడ్​లు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. శ్రీశైలంగౌడ్, వివేకానంద్​లు ఇద్దరూ వరసకు బాబాయ్-అబ్బాయ్​లే అవుతారు. అందరికి అందుబాటులో ఉండడం, ఈసారి గెలిస్తే కేసీఆర్​ మంత్రివర్గంలో చోటు వస్తుందనే ధీమాను వ్యక్తంచేస్తున్నారు.

వివేకానంద్ తండ్రి పాండుగౌడ్​కు గతంలో రాజకీయంగా మంచిపేరుంది. ఇది కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలను, ముంపు సమస్యలను పూర్తిగా పరిష్కరించలేదనే అరోపణలు ఉన్నాయి. హన్మంతరెడ్డి 2014 పోటీ చేసి ఓడిపోయారు. ఆ సానుభూతి పనిచేస్తుందని హన్మంతరెడ్డి అనుచరులు అనుకుంటున్నారు. నియోజకవర్గ సమస్యలపై పూర్తిస్థాయిలో పట్టులేదనే అభిప్రాయం స్థానికుల్లో నెలకొంది. శ్రీశైలంగౌడ్ గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి అనంతరం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అతని అనుచరులు పలు ఆక్రమణలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్‌ - వేల కోట్లు దారి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ : భట్టి విక్రమార్క

ఓట్ల లెక్కింపు వాయిదా- ఆదివారం కాదట- మరి ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.