ETV Bharat / state

ఎంబీఏ డ్రాపవుట్.. ఇప్పుడు రూ.కోట్లలో సంపాదన!

ప్రఫుల్‌ బిల్లోర్‌... దేశంలోని ప్రఖ్యాత చాయ్‌వాలాల్లో తాను రెండోవాడినని గర్వంగా చెబుతాడు. మొదటిస్థానం ఎవరిదో ప్రత్యేకంగా చెప్పేదేముంది. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ‘ఎంబీఏ చాయ్‌వాలా’ గురించి చర్చ నడుస్తోంది. పాతికేళ్లు కూడా లేని ఈ కుర్రాడు చాయ్‌లతో కోట్లు సంపాదిస్తున్నాడు. మరి అతడికి ఇదెలా సాధ్యమైందంటే...

mba chaiwala, chai business success story
ఎంబీఏ చాయ్​వాలా, చాయ్​వాలా విజయగాథ
author img

By

Published : Mar 28, 2021, 1:31 PM IST

పాతికేళ్లు లేని చాయ్​వాలా గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎంబీఏ డ్రాపవుట్​ అయిన ప్రఫుల్​ బిల్లోర్ చాయ్​ దుకాణం పెట్టి కోట్లలో సంపాదిస్తున్నాడు. బీకామ్‌ పూర్తిచేసిన ప్రఫుల్‌ బిల్లోర్‌ది మధ్యప్రదేశ్‌లోని ధార్‌. దాదాపు రెండున్నరేళ్లపాటు ఎంబీఏ ప్రవేశ పరీక్ష ‘క్యాట్‌’ కోసం సర్వశక్తులా ప్రయత్నించినా ఐఐఎమ్‌లో సీటు రాలేదు. అతడి ర్యాంకుకు ఏదో ఒక కాలేజీలో సీటు వస్తుంది. కానీ, ఏదో ఒకటి అనుకుని డబ్బూ, సమయం వృథా చేసుకునే రకం కాదు ప్రఫుల్‌. ఎంబీఏ సంగతి కొన్నాళ్లు మర్చిపోవడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించాడు.

అలా చాయ్​వాలా

ఆ సమయంలో అహ్మదాబాద్‌లో ఆగి, మెక్‌ డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగిగా పనిచేశాడు. అక్కడ మొదట బల్లలు శుభ్రంచేసిన ప్రఫుల్‌ తర్వాత బర్గర్‌ తయారీ విభాగంలోకి మారాడు. అక్కడ రోజుకు రూ.250 వచ్చేది. ఆ సమయంలో అతడికి ఆహార రంగంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి అర్థమైంది. ఆ క్రమంలో ఓ చాయ్‌వాలాతో మాట కలిపినపుడు-తన గమ్యం స్పష్టమైంది. తాను పెట్టాల్సింది చాయ్‌ దుకాణమని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో చెబితే ‘నోరు మూసుకుని చదువుకో’ అన్నారు. ఫ్రెండ్స్‌ అయితే ‘ఐఐఎమ్‌లో ఎంబీఏ అన్నావ్‌, చివరకు టీస్టాలా’ అని ఎగతాళిగా మాట్లాడారు.

అలా చాయ్​వాలాగా..

ఎంబీఏ డ్రాపవుట్‌
తల్లిదండ్రుల సంతృప్తికోసం అహ్మదాబాద్‌లోనే ఓ ఎంబీఏ కాలేజీలో చేరాడు. కానీ కాలేజీలోకంటే మెక్‌డొనాల్డ్స్‌లోనే వ్యాపార పాఠాలు బాగా అర్థమయ్యేవని చెబుతాడు ప్రఫుల్‌. కొద్ది నెలల తర్వాత స్టవ్‌, డేగిశా, లైటర్‌ పట్టుకుని ఓ ఫుట్‌పాత్‌మీద చాయ్‌ దుకాణం ప్రారంభించాడు. మొదటిరోజు పాలు ఒలికిపోయాయి. టీలో పంచదార ఎక్కువైంది. ఆరోజు ఒకే ఒక్క చాయ్‌ అమ్మాడు. అయినా, బోణీ కొట్టాననుకున్నాడు. చాయ్‌తోపాటు చర్చలూ ప్రఫుల్‌ ప్రత్యేకత. తన దుకాణం దగ్గరకు వచ్చేవాళ్లతో రాజకీయాలూ, మానవ సంబంధాల గురించి చర్చిస్తాడు. అతడి టీ, ఆలోచనల టేస్ట్‌ నచ్చి దుకాణానికి వచ్చేపోయేవాళ్లు పెరిగారు. ఆదాయం నెలకు రూ.15వేలు దాటిన తర్వాత ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకున్నాడు.

తన దుకాణంలో సాయంత్రాలు యువతకు ఓపెన్‌ మైక్‌, కెరీర్‌ గైడెన్స్‌, వ్యాపార పాఠాల గురించి చిన్నపాటి సమావేశాలు నిర్వహించేవాడు. రుచితోపాటు మెదడుకు మేత ఉండేసరికి అహ్మదాబాద్‌లో యువతకు అదో హాట్‌స్పాట్‌ అయింది. తన వ్యాపారానికి చదువు అడ్డంకిగా మారుతుండటం చూసి ఎంబీఏ మధ్యలోనే వదిలేశాడు. ఈసారి అతడికి తల్లిదండ్రుల మద్దతూ దొరికింది. ప్రఫుల్‌ చాయ్‌ దుకాణానికి ఓ ‘వాలెంటైన్స్‌ డే’ నాడు యువత తండోపతండాలుగా వచ్చారు. సాధారణంగా ఆరోజు జంటలకు బహుమతులు ఉంటాయి. అందుకు భిన్నంగా తన లాంటి ఒంటరిజీవుల గురించి ఆలోచించిన ప్రఫుల్‌... ఆరోజు సింగిల్‌గా వచ్చేవాళ్లకి చాయ్‌ ఉచితం అన్నాడు. అంతే, కోట్ల రూపాయల విలువైన ప్రచారం దొరికింది. ‘మిస్టర్‌ బిల్లోర్‌ అహ్మదాబాద్‌’కు సంక్షిప్తంగా ‘ఎంబీఏ’ అని పేరుపెట్టాడు. కొందరు వివాహ వేడుకల్లో ప్రఫుల్‌చేత టీ స్టాల్‌ పెట్టించారు. అదే సమయంలో తన ఎంబీఏ చాయ్‌వాలా దుకాణాల్ని ఇతర నగరాలకూ విస్తరించాడు ప్రఫుల్‌. దుకాణాలు 30కి పెరిగాయి. సంస్థ టర్నోవర్‌ మూడు కోట్ల రూపాయలు దాటింది.

ఎంబీఏ చాయ్​వాలా

ఆదాయ మార్గాలెన్నో
2020 దిల్లీ శాసనసభ ఎన్నికల సమయంలో ఆమ్‌ ఆద్మీ తరఫున ప్రచారంలోనూ పాల్గొన్నాడు. అంటే మైక్‌ పట్టి ఆ పార్టీ కోసం ఓట్లు వేయమని అడగలేదు. దిల్లీలో ఎంబీఏ చాయ్‌వాలా తాత్కాలిక దుకాణం పెట్టాడు. టెంటుపైన ఆమ్‌ ఆద్మీ విజయాల్ని రాసి ఉంచాడు. ప్రఫుల్‌ మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా. కొన్నిసార్లు ఐఐఎమ్‌ విద్యార్థులకే స్ఫూర్తినిచ్చే పాఠాలు చెబుతుంటాడు.
‘చాయ్‌ దుకాణం ఎందుకు’ అని ప్రశ్నించేవాళ్లకి ‘ఎందుకు కాకూడదు’ అని బదులిస్తూనే... ‘చాయ్‌ని ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్మొచ్చు. అన్ని ఆదాయ వర్గాలకూ, అన్ని వయసులవాళ్లకూ చాయ్‌ కావాల్సిందే’ అంటాడు. ఒకప్పుడు ప్రఫుల్‌ని చూసి నవ్వినవాళ్లే ఇప్పుడు అతడిని కెరీర్‌ గురించి సలహాలు అడుగుతున్నారు. యువ వ్యాపారులకు అతడు చెప్పేది ఒకటే, ‘పెద్ద కలలు కనండి... చిన్న మొత్తంతో మొదలుపెట్టండి, కానీ ఇప్పుడే ఆరంభించండి’ అని... వింటున్నారా!

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్​, సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.