హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని హరిహరపురం కాలనీ పూర్తిగా నీట మునిగింది. మూడు వందలకుపైగా ఇళ్లలోకి నీరు చేరింది. కప్పల చెరువు నుంచి వరద నీరు హరిహరపురం కాలనీలోకి వస్తోంది. బోటు సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. ట్రాక్టర్లలో ముంపు బాధితుల్ని పునరావాస కాలనీలకు తరలిస్తున్నారు.
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హరిహరపురం కాలనీలో పర్యటించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపడుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. స్థానికులు తమ సమస్యల్ని మేయర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కప్పల చెరువు నీటిని దారి మళ్లిస్తే వరద ముప్పు తగ్గుతుందని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: భర్త మొబైల్ తీసుకున్నాడని పిల్లల్ని చంపేసిన భార్య!