ETV Bharat / state

'శుక్రవారం నుంచి గ్రేటర్​లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలి' - sanitation drive in ghmc

జీహెచ్​ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై కార్పొరేటర్లు పర్యవేక్షించాలని మేయర్​ గద్వాల విజయలక్ష్మి సూచించారు. వారం రోజుల పాటు ఉదయం రెండు గంటలపాటు సంబంధిత వార్డుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని పేర్కొన్నారు.

sanitation drive in ghmc
గ్రేటర్​లో పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ
author img

By

Published : Apr 21, 2021, 9:34 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను రోజూ రెండు గంటల పాటు కార్పొరేటర్లు పర్యవేక్షించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని కార్పొరేటర్లందరూ తమ తమ వార్డు పరిధిలో ఈ శుక్రవారం నుంచి వారం రోజుల పాటు పర్యటించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనుల తీరును పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

కరోనాను అంతమొందించాలి..

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. గ్రేటర్​లో గత మూడు రోజుల నుంచి ముమ్మరంగా గార్బేజ్ తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ సాగుతోందని మేయర్​ అన్నారు. దీనికి కొనసాగింపుగా కార్పొరేటర్లందరూ తమ పరిధిలో నిత్యం చెత్తతో ఉండే ప్రాంతాల్లో చెత్త తొలగింపు, వ్యాధుల వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలని పేర్కొన్నారు. నగరంలో విస్తృత స్థాయిలో వ్యాపిస్తున్న కరోనా నిరోధానికి ప్రజాప్రతినిధులుగా కీలక పాత్ర వహించాలని చెప్పారు.

ఇదీ చదవండి: వచ్చే నెల నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.