ETV Bharat / state

కార్మికురాలి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్​గ్రేషియా

విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబానికి మేయర్​ బొంతు రామ్మోహన్​ ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. రూ. 2 లక్షలను అందించనున్నట్లు తెలిపారు. నగరంలోని కాప్రా సర్కిల్​కి చెందిన కార్మికురాలు ఆండాలుని.. బైక్​ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె ఈ రోజు మృతి చెందింది.

mayor announces ex gratia for sanitary worker
పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్​గ్రేషియా
author img

By

Published : Nov 16, 2020, 2:09 PM IST

నగరంలోని కాప్రా సర్కిల్​కు చెందిన జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు ఆండాలు కుటుంబ సభ్యులకు మేయర్​ బొంతు రామ్మోహన్​ రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇటీవల విధి నిర్వహణలో ఉన్న ఆండాలును మోటార్ సైకిల్ ఢీ కొనగా తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ కార్మికురాలు ఈ రోజు మరణించింది.

మృతి చెందిన ఆండాలుకు బీమా సౌకర్యం, ఇతర అలవెన్సులతో పాటు ఆమె కుటుంబానికి మేయర్ నిధుల నుంచి ప్రత్యేకంగా రూ. 2 లక్షలను అందజేయనున్నట్లు బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. కార్మికురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.