మాట్రిమోని పేరుతో మోసాలకు పాల్పడిన మహిళపై హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలుగు మాట్రీమోనిలో పరిచయమైన మాళవిక అలియాస్ మాగంటి అనుపల్లవి రూ. కోటి 2 లక్షలు తీసుకుని తనను మోసం చేసిందంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. గతంలోనూ పెళ్లి పేరుతో మాట్రిమోనిలో పరిచయమై కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను రూ. 65 లక్షలు మోసం చేసిన కేసులో మాళవిక జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కుమారుడు, భర్తతో కలిసి మాళవిక ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆమె కొడుకు ప్రణవ్ను అరెస్టు చేయగా భర్త పరారీలో ఉన్నాడు. బాధితులు ఒక్కరొక్కరుగా ఫిర్యాదులు చేయడం వల్ల మాళవిక ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేసిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష