ETV Bharat / state

ప్రతి అమ్మా... వరల్డ్ ఫేమస్ లవరే..! - ఐ లవ్ యూ మై వరల్డ్ ఫేమస్ లవర్...

ఆకాశమంతటి ప్రేమ... భూదేవతంతటి ఓపిక... చల్లని గాలంటి కరుణ... సెలయేటి సవ్వడంటి నవ్వు... చర చరా మండే కోపం... పంచభూతాలకు పరమార్థమే అమ్మ అని నా భావం. ఆ భావాన్నే నా భాషలో చెప్పాలంటే... 24 చేతులున్న అందమైన, అరుదైన రూపం అమ్మ... అర్థం కాలేదా.... రండి వివరంగా చెప్తా...

mathers day special story world famous lover
ప్రతి అమ్మా... వరల్డ్ ఫేమస్ లవరే..!
author img

By

Published : May 10, 2020, 10:44 AM IST

Updated : May 10, 2020, 11:13 AM IST

అమ్మంటే... మనిషిగా ఒక్కతే కానీ నాకు మాత్రం ఎన్నో రూపాలు దాల్చిన అమ్మవారిలా కనిపిస్తుంటుంది...ఎలాగో చెప్తా వినండి....

నెత్తికి నూనె అంటి.. ఫౌడరేసి బొట్టు పెట్టి.. కళ్ళకు కాటుక రాసిన బ్యూటీషన్...

చేతులకు దిష్టిపూసలు కట్టి.. కాళ్ళకు గజ్జెల కడియాలు పెట్టిన డిజైనర్...

ఉక్కపోసినప్పుడు చీరకొంగుతో గాలి విసిరిన ఎయిర్​కూలర్...

ఏడిస్తే భుజాన ఎత్తుకుని వీధంతా తిప్పిన హెలికాఫ్టర్...

పెరిగినా కొద్దీ బరువనకుండా సంకనేసుకుని తినిపించిన వెయిట్ లిఫ్టర్...

బుడి అడుగులు వేస్తున్నప్పుడు వేలు అందించిన సపోర్టర్...

ఉంగా..ఉగ్గు.. పలుకులను మాటలుగా మలిచిన టీచర్....

చందమామ వెన్నెల్లో అనగనగా... అంటూ చెప్పిన స్టోరీ టెల్లర్...

తారంగం నుంచి తీన్మార్ స్టెప్ప్పులేసేలా సిద్ధం చేసిన డాన్స్ మాస్టర్...

వాకిట్లో చక్కని ముగ్గేసి.. ఇల్లును అందంగా తీర్చిదిద్దే డెకరేటర్..

తన కుటుంబం బాగుండాలని దేవున్ని ఎల్లప్పుడూ కోరుకునే ప్రేయర్...

అందరికంటే ముందే లేచి ఆప్యాయంగా నిద్దుర లేపే సన్ రైస్...

ఎల్లప్పుడు కంటికి రెప్పలా కాచుకు చూసుకునే కేర్ టేకర్...

జ్వరమొస్తే తడిగుడ్డ వేసి తన ప్రేమతోనే తగ్గించే డాక్టర్...

ఎవరితోనైనా పొట్లాడితే ఎప్పుడూ నావైపే వాదించే లాయర్...

ఏదడిగినా లేదనకుండా ఉన్నదాంట్లో సమకూర్చే హెచ్చార్​ మేనేజర్...

ఏ పని చేస్తానన్న నీ వెంట నేనున్నానని భరోసానిచ్చే సపోర్టర్...

జీవితంలోని అన్ని విషయాలు చెప్తూ.. ఇలా బతకాలని వివరించే మంచి స్పీకర్

ఎప్పుడైనా కుంగిపోతే నువ్ సాధించగలవని ధైర్యం నింపే మోటివేటర్...

బతుకాటలో ఎన్నో పాములు, నిచ్చెనలు వచ్చినా.. అలుపెరగక ఆడుతున్న ప్లేయర్...

ఎన్ని పనులు చేసినా.. ముఖంలో చిరునవ్వు చెరగనివ్వని బ్యూటిఫుల్ హార్డ్ వర్కర్..

ఏమి తెలియని స్థితి నుంచి ఇంకొకరికి చెప్పే స్థాయికి తెచ్చిన కింగ్ మేకర్...

చెట్టంత ఎదిగినా.. పిల్లాడిలానే చూసుకుంటూ జాగ్రత్తలు చెప్పే ఇన్​స్ట్రక్టర్​...

నాకు నచ్చినవన్ని చేసిపెట్టి... నా ఆనందంతోనే కడుపునింపుకునే కుక్...

కుక్కలు, పిల్లులతోనూ ముచ్చట పెట్టి దోస్తులను చేసుకునే పెట్ లైకర్...

చిన్న పని చేసినా పెద్దగా మురిసిపోయి మెచ్చుకునే అప్రిషియేటర్...

తన చిన్ని లోకంలో కష్టాలు, బాధలు దాచుకుని... సంతోషాన్ని మాత్రమే పంచే ఇంట్రోవర్ట్...

చావుకు ఎదురెళ్లి పేగు తెంచి ప్రాణంపోసే ప్రతి అమ్మ ఓ ఫైటరే...

తన వాళ్లకోసం చివరి శ్వాసవరకు కష్టాన్ని ఇష్టాంగ భరించే ప్రతి మహిళా ఓ సోల్జరే..

కొంచెమైనా తగ్గని అనురాగం... అమితమైన ఆప్యాయత... అంతులేని ప్రేమ పంచే ప్రతి అమ్మ.. వరల్డ్ ఫేమస్ లవరే...!!!

ఐ లవ్ యూ మై వరల్డ్ ఫేమస్ లవర్...

ఇదీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం

Last Updated : May 10, 2020, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.