ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ వెనుక మాస్టర్ మైండ్ ఆమెదే - ఎవరు టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్ చేశారు

TSPSC paper leakage update : టీటీసీ చదివిన తమ్ముడికి ఏఈ ఉద్యోగం కావాలంటూ నమ్మించింది. డబ్బు ఆశ చూపి ప్రశ్నాపత్రాల కొనుగోలు చేసింది. అవే పేపర్లను ముందుగానే బేరం కుదుర్చుకున్న వారికి అప్పజెప్పి.. లక్షల రూపాయలు కాజేసింది. టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన టీచర్ రేణుక బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధాన నిందితుడైన టీఎస్​పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌ కుమార్‌కు అనుమానం రాకుండా చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.

How did the TSPS paper leak happen
టీఎస్​పీఎస్​ పేపర్​ లీక్​ జరిగిన విధానం
author img

By

Published : Mar 16, 2023, 7:21 AM IST

Updated : Mar 16, 2023, 7:39 AM IST

TSPSC paper leakage update: టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈ వ్యవహారంలో గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తమ్ముడి పేరుతో రేణుక దంపతులు ప్రశ్నాపత్రాలు సంపాదించేందుకు తెరవెనుక పెద్ద తతంగమే నడిపారు.

Master mind behind TSPSC Paper leakage : పరీక్ష రాసేందుకు అర్హత లేని తమ్ముడిని చూపించి ముందుగానే అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని లక్షలు కాజేసేందుకు వ్యూహరచన చేశారు. ప్రధాన నిందితుడు, కమిషన్‌ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్‌కుమార్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌ సాయంతో అసిస్టెంట్‌ ఇంజినీర్‌- సివిల్‌ ప్రశ్నాపత్రాలు దక్కించుకుని లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుక తమ్ముడు రాజేశ్వరర్‌ నాయక్‌ అసలు ఏఈ పరీక్ష రాసేందుకు అర్హుడే కాదని పోలీసులు గుర్తించారు. టీటీసీ పూర్తిచేసిన రాజేశ్వర్‌ స్వగ్రామంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. ఈయన పేరు చెప్పి ఏఈ ప్రశ్నాపత్రాలు దక్కించుకున్న రేణుక వీటిని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె. నీలేష్​నాయక్, గోపాల్‌ నాయక్‌కు ఇచ్చేలా రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న రేణుక మొదటగా ఈ నెల 2న బాలాపూర్ క్రాస్ రోడ్ వద్ద ప్రవీణ్‌కు రూ.5లక్షలు ఇచ్చింది.

ఆ తర్వాత అదే ప్రశ్నాపత్రాన్ని రూ.14 లక్షలు తీసుకొని ఎల్బీనగర్‌లోని ఓ లాడ్జీలో ఉన్న నీలేశ్‌, గోపాల్‌కు అప్పగించింది. వారు ఆ పేపర్‌లోని ప్రశ్నలు తెలుసుకుని ప్రిపేర్‌ అయి పరీక్ష రాసేలా ప్రణాళిక రచించారు. ఆ తర్వాత పరీక్ష ముగిశాక ఏ మాత్రం అనుమానం రాకుండా ఒప్పందం మేరకు మిగిలిన రూ.5 లక్షలతో పాటు ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్‌కు అప్పగించింది. ఈ వ్యవహారంలో సోదరుడు రాజేశ్వర్‌ నాయక్‌కు కూడా ఎంతో కొంత ముట్టచెప్పేలా అంగీకారం కుదిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏదో కారణం చెప్పి స్కూల్​కి సెలవులు పెట్టింది: రేణుక తాను చేస్తున్న ఉద్యోగానికి సెలవులు పెట్టి మరీ అక్రమాలకు ప్రయత్నించినట్లు తేలింది. నిందితురాలు 2018లో టీజీటీ పోస్టుకు ఎంపికై.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారం గిరిజన గురుకుల పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు 16 రోజులు సెలవులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 4, 5 తేదీలు ఏఈ పరీక్ష జరిగిన రోజుల్లోనూ సెలవులోనే ఉంది. తన కుమారుడి ఆరోగ్యం బాగోలేదని, తన మరిది చనిపోయాడని మేసేజ్‌లు పెట్టి లీవ్‌ తీసుకుంది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ ఈ నెల 12న జరగాల్సి ఉండగా 10, 11 తేదీల్లో ఆమె సెలవుల్లోనే ఉన్నారు. రేణుకను సస్పెండ్‌ చేయనున్నట్లు గురుకుల సొసైటీ వర్గాలు తెలిపాయి.

శ్రీనివాస్​పై​ పోలీస్ శాఖ చర్యలు: ఈ కేసులో మేడ్చల్‌ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కెతావత్ శ్రీనివాస్‌పై పోలీస్‌ శాఖ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా మన్సూర్‌తల్లి తండాకు చెందిన శ్రీనివాస్‌.. 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. మెయిన్స్‌కు సిద్ధమయ్యేందుకు ఫిబ్రవరి 1 నుంచి సెలవులో ఉన్నాడు.

రేణుక నుంచి ప్రశ్నాపత్రం విక్రయిస్తా మంటూ ఫోన్‌కాల్‌ వచ్చినపుడు తనకు అవసరం లేదంటూ సమాధానమిచ్చి.. ఏఈ పరీక్షలకు సిద్ధమవుతున్న కొందరు అభ్యరుల సమాచారం అందజేశాడు. పోలీస్ కొలువులో ఉండి కళ్లెదుట జరుగుతున్న నేరంపై మౌనంగా ఉండటం, సమాచారం ఇవ్వకపోవటంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. లీకేజీ కేసులో శ్రీనివాస్‌ అరెస్ట్‌ కావటంతో అతనిపై నివేదిక తయారు చేసి సీపీ కార్యాలయానికి పంపించినట్లు మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 16, 2023, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.