కృష్ణా జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. పట్టణ శివారులోని అంబారుపేట వద్ద ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టింది.
కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరందరూ నందిగామకు చెందినవారే. మరొకరికి తీవ్ర గాయాలవగా... స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో పాటు ఫోన్ మాట్లాడుతూ కారు నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.