ETV Bharat / state

'ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి రక్షణ పొందొచ్చు' - hyderabad latest news

కరోనా భయంతో విచ్చలవిడిగా మాస్కుల వినియోగం పెరిగిందని ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ అన్నారు. సాధారణ మాస్కుల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా... ఇతర ఇన్పెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.

mask awareness program
ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను అరికట్టవచ్చు
author img

By

Published : Mar 7, 2020, 7:31 PM IST

Updated : Mar 7, 2020, 7:56 PM IST

మాస్కు వేసుకుంటే కరోనా సోకదనేది కేవలం అపోహ మాత్రమేనని ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ అన్నారు. అందరికీ మాస్కులు అవసరం లేదని సూచించారు. మాస్కుల విపరీత డిమాండ్ వల్ల వాటి ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.

నివారణ లేని వైరస్​కు.. అవగాహనే మందు

మన వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతికే పరిస్థితి దాదాపు లేదని.. అయినా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మంచిదేనన్నారు. ఈనెలాఖరు వరకు వైరస్ భయాలు పూర్తిగా తొలిగిపోతాయన్న ఆయన.. నిరభ్యంతరంగా ఎవరి పని వారు చేసుకోవచ్చని ధైర్యం చెప్పారు.

ఎలా వస్తుంది...?

* ఒక్క అడుగు దూరంలో తుమ్మినప్పుడు ఆ తుంపరలు మన చేతిని తాకి ముఖాన్ని ముట్టుకున్నప్పుడు వైరస్​ వచ్చే ప్రమాదం ఉంది.

* ఈ వైరస్​ గాలిలో 15 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువ బతకదు.

వైరస్​ సోకినట్లు నిర్ధరించుకోవడం ఎలా?

* జ్వరం ఉంటుంది.

* దగ్గు ఉంటుంది.

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. రోగిలో ఈ మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.

చేతులను ఏఏ సందర్భాల్లో శుభ్రం చేసుకోవాలి

* ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు, ఏదైనా తలుపు తెరిచినప్పుడు, ఏవైనా ఫైల్స్​ ముట్టుకున్న తర్వాత, ఎక్కడికైనా బయటకు వెళ్లి వచ్చినప్పుడు, రోగిని చూడడానికి వెళ్లి వచ్చినప్పుడు చేతులతో ఎక్కడా తాకకుండా శుభ్రం చేసుకోవాలి.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి రక్షణ పొందొచ్చు

ఇదీ చూడండి: 15ఏళ్లకు తిరిగొచ్చిన కొడుకు.. ఆకాశాన్నంటిన సంబరం

Last Updated : Mar 7, 2020, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.