The groom refuse marriage because given old bed: ప్రేమ వ్యవహారాలు బయటపడటం, అదనపు వరకట్నం కోసం వధువు తరుపు వారిని బలవంతపెట్టడం వంటి కారణాల వల్ల పెళ్లిళ్లు మధ్యలోనే ఆగిపోవడం వంటి సంఘటనలు నిత్యం ఏదో చోట బయటకు వస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్య కొన్ని చిన్నచిన్న కారణాల వల్ల కూడా పెళ్లిలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. మొన్నామధ్య పెళ్లికి మాంసాహారం పెట్టలేదనే కారణంతో ఓ పెళ్లి పీటలపైనే ఆగిపోయింది. ఈ ఘటన కూడా అలాంటి కోవకు చెందినదే. కాకపోతే ఇక్కడ కారణం మాంసాహారం కాదు.. పాత మంచం. అవునండీ.. ఇది నిజం. తనకు పాత మంచం ఇచ్చారని పెళ్లికొడుకు నిఖాకు నిరాకరించిన ఘటన హైదరాబాద్ బండ్లగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్లో ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్‌గా పని చేసే మౌలాలికి చెందిన మహమ్మద్ జకారియాకు పాతబస్తీ బండ్లగూడకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు వైపుల వారు పెద్దల సమక్షంలో కట్నకానుకలు మాట్లాడుకున్నారు. ఈ నెల 13న వధువు ఇంటి వద్ద ఘనంగా నిశ్చితార్థం కూడా చేశారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక మసీదులో పెళ్లి కావాల్సి ఉంది.
వారి సాంప్రదాయం ప్రకారం శనివారం సాయంత్రమే పెట్టుపోతలు.. అవేనండీ మంచం, ఇతర ఫర్నీచర్ వరుడి ఇంటికి పంపారు. అయితే మంచం విడి భాగాలు జోడిస్తుండగా అది విరిగిపోయింది. దీంతో పాత మంచానికి రంగులు వేసి తనకు పంపించారని భావించిన పెళ్లికుమారుడు.. నిఖా సమయానికి రాలేదు. దీంతో వధువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లగా.. 'పెళ్లికి ముందు మట్లాడుకన్న ప్రకారం కట్నకానుకలు పంపలేదు. పాత మంచం ఎందుకు ఇచ్చావంటూ గొడవపడ్డాడు'. ఇందుకు వరుడి తల్లి కూడా వంతు పాడింది. చివరకు తాను ఈ పెళ్లి చేసుకోనని నిఖా చేసుకోవాల్సినోడు తెగేసి చెప్పాడు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎస్సై మాట్లాడగా వరుడు పెళ్లికి అంగీకరించాడు. అయితే ఇక్కడే వధువు తండ్రి అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఈ పెళ్లికి వరుడు ఒప్పుకున్నా.. తాను ఒప్పుకునేదే లే అంటూ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇవీ చదవండి: