ETV Bharat / state

విపత్తుల పర్యవేక్షణకు శాశ్వత పరిష్కారం అవసరం: మర్రి - marri sasidhar reddy on hyderabad floods

తెలంగాణలో వరదలు వచ్చినప్పడు చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఓ శాశ్వత పరిష్కారం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి మర్రి శశిధర్​రెడ్డి డిమాండ్​ చేశారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికలు జరపకపోవడం వల్లే హైదరాబాద్​కు వరదలు ముంచెత్తాయని ఆయన ఆరోపించారు.

marri sashidhar reddy on hyderabad floods
విపత్తుల పర్యవేక్షణకు శాశ్వత వ్యవస్థ అవసరం: మర్రి శశిధర్
author img

By

Published : Oct 22, 2020, 4:15 PM IST

వరదలు, అధిక వర్షాలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం ఓ శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, జాతీయ విపత్తుల నిర్వహణ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్​రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. వర్షాకాలానికి ముందు వరద కాలువల పూడికతీత, వ్యర్థాల తొలగింపు లాంటి చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో సముద్రం లేకపోయినా.. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే హైదరాబాద్​లో ఇలాంటి ఉపద్రవం ఎదురైందని మర్రి ఆరోపించారు.

తెలంగాణవ్యాప్తంగా హైదరాబాద్​కు అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ మౌలిక వసతుల కల్పన కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని మర్రి శశిధర్​ డిమాండ్ చేశారు. బాధితులకు ఆర్థిక సహాయం అందజేయడంలో రాజకీయాలు అంటగట్టకుండా.. అందరికీ ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండిః పాతబస్తీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.