ETV Bharat / state

Marketing Department: ప్రత్యేక విభాగం ఏం చేస్తోంది? ఆ నివేదిక ఏమైంది? - గిట్టుబాటు ధరలపై నివేదిక

ప్రతి పంట కాలానికి ముందే గిట్టుబాటు ధరలపై నివేదిక ఇచ్చేలా మార్కెటింగ్‌ శాఖ (Marketing department Yasangi report )లో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి నా ఫలితం లేకపోయింది. సీజన్‌కు ముందే రైతులకు సమాచారమివ్వాలని సీఎం ఆదేశమిచ్చారు. కానీ యాసంగి ప్రారంభమై నెలన్నరవుతున్నా విడుదల కాని నివేదిక (Marketing department Yasangi report )ఇంకా విడుదల కాలేదు.

marketing-department-yasangi-report
గిట్టుబాటు ధరలపై నివేదిక
author img

By

Published : Nov 13, 2021, 2:13 PM IST

ఏ పంట వేస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందనే విషయాన్ని జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను లోతుగా విశ్లేషించి ప్రతి సీజన్‌కు ముందే రైతులకు చెప్పాలి. అధిక గిరాకీ ఉన్న పంటలే సాగుచేసేలా వారిని చైతన్యపరచాలి.

- ఏడాది క్రితం సీఎం కేసీఆర్‌ వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలకిచ్చిన ఆదేశమిది.

సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి పంట కాలానికి ముందే గిట్టుబాటు ధరలపై నివేదిక (Marketing department Yasangi report) ఇచ్చేలా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖలో ప్రత్యేకంగా ‘మార్కెట్‌ పరిశోధన (రీసెర్చ్‌), విశ్లేషణ(అనాలిసిస్‌) విభాగం గతంలో ఏర్పాటుచేశారు. ఈ విభాగం దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న పంటలేమిటి, రాష్ట్రంలో ఏఏ జిల్లాల్లో అవి పండే వీలుంది, ఎంత విస్తీర్ణంలో సాగుచేయొచ్చు, ఎగుమతులకు ఉన్న అవకాశాలు ఏమిటి, తదితరాలను విశ్లేషించి పంట కాలానికి ముందే నివేదిక (Marketing department Yasangi report ) ఇవ్వాల్సి ఉంది. తదనుగుణంగా వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొందించాలి. కానీ ఇవేమీ జరగడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటికే ముగిసిన వానాకాలం(ఖరీఫ్‌)లోగానీ, యాసంగి(రబీ) సీజన్‌ ముందుగానీ ఎలాంటి నివేదికలూ (Marketing department Yasangi report ) విడుదల చేయకపోవడమే దానికి నిదర్శనం.

కొనుగోళ్లపై భరోసా ఏది?

వరిసాగు వద్దని వ్యవసాయశాఖ కొంతకాలంగా చెబుతూ వస్తోంది. కేంద్రం అనుమతించినందున మినుము సాగుచేస్తే మద్దతు ధరకు కొంటామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి (Minister Niranjana Reddy) ఇటీవల ప్రకటించారు. మరి మిగతా పప్పుధాన్యాలు, నూనెగింజలను ఎవరు కొంటారు? ప్రభుత్వం కొంటుందా? ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి వస్తే మద్దతు ధర లభిస్తుందా? అనే అంశంపై స్పష్టత కొరవడంతో రైతుల్లో అయోమయం నెలకొందని వ్యవసాయాధికారులే అంగీకరిస్తున్నారు. ‘‘వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు రైతులతో సమావేశమయ్యాం. వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలు వేయమని సూచించాం. ఈ సందర్భంగా పలువురు రైతులు ‘వరి వద్దు సరే..ఇతర పంటలు సాగుచేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా కొంటుందా, ఒకవేళ ప్రభుత్వం కొనకపోతే ఎక్కడ అమ్ముకోవాలి? ధర రాక నష్టపోతే ఏం చేయాలి?’ అంటూ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర, కొనుగోళ్లపై పూచీకత్తు ఇవ్వకపోవడం వల్లనే వరిసాగు మానడానికి రైతులు ఇష్టపడటం లేదు’’అని నల్గొండ, పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు మండలస్థాయి వ్యవసాయాధికారులు తెలిపారు. ‘‘వరి సాగుచేస్తే ధాన్యాన్ని తమ గ్రామంలోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం పెట్టి మరీ కొంటోంది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి మద్దతు ధర వస్తుందనే భరోసా లభించింది. ఇతర పంటల విషయంలో ఈ తరహా ధీమా లేకపోవడం పెద్ద సమస్యగా మారింది’’అని జిల్లా వ్యవసాయాధికారి ఒకరు విశ్లేషించారు. మార్కెట్‌ పరిశోధనా విశ్లేషణ నివేదిక (Marketing department Yasangi report ) విడుదల చేయకపోవడంపై మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి (Minister Niranjana Reddy)ని సంప్రదించగా.. త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: Paddy Crop in Telangana: 'వరిసాగు తగ్గాలి.. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి!'

Rabi Season 2021: ఆకాశంలో విత్తనాల ధరలు.. ఆ సొమ్ము ఎవరి ఖాతాలోకి చేరుతుంది?

Rabi crops in Telangana : 'యాసంగిలో వరి సాగు వద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.