ETV Bharat / state

ధరణి పోర్టల్‌లో ఆస్తి వివరాల వద్దే మార్కెట్‌ విలువ - తెలంగాణలో ఆస్తుల వివరాల నమోదు

తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల విలువ నిర్ధారించే ప్రక్రియ వేగవంతమైంది. వ్యవసాయ వ్యవసాయేతర విలువలను ధ్రువీకరించి బాధ్యతను ప్రత్యేకంగా కమిటీలకు అప్పగించారు సర్వే నెంబర్లు, డోర్ నెంబర్లు ఆధారంగా ఆస్తుల విలువను ధ్రువీకరిస్తారు. వచ్చే సోమవారం నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వము అధికారులను ఆదేశించింది.

Market value is dispalyed at property details on Dharani portal
ధరణి పోర్టల్‌లో ఆస్తి వివరాల వద్దే మార్కెట్‌ విలువ
author img

By

Published : Oct 2, 2020, 7:30 AM IST

రిజిస్ట్రేషన్‌ విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆస్తుల మార్కెట్‌ విలువను ధ్రువీకరించేందుకు శ్రీకారం చుట్టింది. ధరణి పోర్టల్‌లో యజమాని వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాల వద్దే ఆ ఆస్తి మార్కెట్‌ విలువను (సబ్‌రిజిస్ట్రార్‌ నిర్ధారించిన రిజిస్ట్రేషన్‌ విలువను) తెలియజేసేలా ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. గందరగోళానికి తావులేకుండా పారదర్శకంగా ఉండేలా ధరణి పోర్టల్‌లో ఈ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సర్వే నంబర్లు, ఇంటి నంబర్ల వారీగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువను (రిజిస్ట్రేషన్‌ విలువను) నిర్ధారించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో వేగవంతం చేశారు. సోమవారం నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇలా..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొదటగా సబ్‌రిజిస్ట్రార్‌ వార్డు/బ్లాక్‌లోని ఇంటి నంబర్ల వారీగా ఎక్కువ విలువ (హయ్యర్‌ వాల్యూ) ఉన్న వ్యవసాయేతర ఆస్తులను(నిర్మాణాలు, ప్లాట్లను) గుర్తించి మార్కెట్‌ ధర నిర్ణయిస్తారు. మిగిలిన వాటికి సాధారణ మార్కెట్‌ ధరను ఖరారు చేస్తారు. ఈ రెండూ కాక.. గుర్తించిన(నోటిఫైడ్‌) మురికివాడల్లో ఇంటి నంబర్ల వారీగా ఆస్తుల మార్కెట్‌ విలువను నిర్ధారిస్తారు.

జీహెచ్‌ఎంసీ మినహా ఇతర నగరాలు, పట్టణాల్లో తొలుత సబ్‌రిజిస్ట్రార్‌ వార్డు/బ్లాక్‌ల వారీగా ఇంటి నంబర్ల ప్రకారం ఎక్కువ విలువ ఉన్న వ్యవసాయేతర ఆస్తులను గుర్తించి మార్కెట్‌ విలువను నిర్ధారిస్తారు. తర్వాత తక్కువ విలువ ఉన్నవాటిని గుర్తించి మార్కెట్‌ రేటు నిర్ణయిస్తారు.

గ్రామపంచాయతీల్లో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి సబ్‌రిజిస్ట్రార్‌ ముందుగా ఎక్కువ విలువ ఉన్న వాటిని గుర్తించి మార్కెట్‌ విలువను నిర్ధారిస్తారు. వీటిని నమోదు చేసిన తర్వాత ప్రత్యేకమైన వెబ్‌ అప్లికేషన్‌ (సాఫ్ట్‌వేర్‌) ద్వారా మిగిలిన నిర్మాణాలు, ప్లాట్లకు సాధారణ మార్కెట్‌ విలువ నిర్ణయిస్తారు.

మార్కెట్‌ ధరలు నిర్ణయించేది వీరే

జీహెచ్‌ఎంసీ పరిధిలో జీహెచ్‌ఎంసీ డివిజినల్‌ కమిషనర్‌కు, సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌కు వారి వారి పరిధిలో మార్కెట్‌ ధరలు నిర్ణయించే బాధ్యత అప్పగించారు. మిగిలిన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో సబ్‌రిజిస్ట్రార్‌, స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ చూస్తారు. గ్రామ పంచాయతీల పరిధిలో సబ్‌రిజిస్ట్రార్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసుల (టీఎస్‌టీఎస్‌) సంస్థ వారు, ధరణి బృందం వారు వెబ్‌అప్లికేషన్‌ రూపొందిస్తారు. సబ్‌రిజిస్ట్రార్‌లకు లాగిన్‌ ఇస్తారు.

వ్యవసాయ భూములకు ఇలా..

వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువను సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌, ఆర్డీవో నిర్ణయిస్తారు. మొదటగా సర్వే నంబర్ల వారీగా అత్యధిక బేసిక్‌ వాల్యూ ఉన్న వాటిని గుర్తిస్తారు. ఇంటి స్థలాలకు అనువైనవి, ప్రధాన రహదారుల పక్కన ఉన్నవాటిని ఎక్కువ విలువైనవిగా గుర్తించి మార్కెట్‌ విలువను నిర్ణయిస్తారు. మిగిలిన సర్వే నంబర్లలోని వ్యవసాయ భూములకు తక్కువ మార్కెట్‌ విలువను నిర్ణయిస్తారు.

ఆస్తుల మార్కెట్‌ ధరల నిర్ధారణ వ్యవహారాన్ని గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ ఐజీ, జాయింట్‌ ఐజీ పర్యవేక్షిస్తారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురపాలకశాఖ డైరెక్టర్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ ఐజీ, జాయింట్‌ ఐజీ; జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రేటర్‌ కమిషనర్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ ఐజీ, ముఖ్య ప్రణాళికా అధికారి పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరిస్తారు.

పీటీఐఎన్‌ లేని ఆస్తులూ నమోదు

రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు- పీటీఐఎన్‌) లేని ఆస్తుల వివరాలను కూడా నమోదు చేయాలని పురపాలకశాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రత్యేక సూచనలు చేసింది. ‘‘పీటీఐఎన్‌ లేని ఆస్తులను యజమాని స్వీయ ధ్రువీకరణ తీసుకొని నమోదు చేయాలి. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఉన్నవారికి సంబంధించి సేకరిస్తున్న మాదిరే అన్ని వివరాలు తీసుకొని నమోదు చేయాలి. ఆస్తుల కొలతలు తీసుకోవాల్సిన అవసరంలేదు’’ అని సూచిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండిః రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భజలమట్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.