Dermatologists Spiritual Union : దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో వైద్యులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ పేర్కొన్నారు. కరోనా సమయంలో వారి ప్రతిభ అద్భుతమని కొనియాడారు. చర్మ క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా లేజర్ చికిత్స ద్వారా నయం చేయగలిగిన అధునాతన పరికరాలు, వైద్యులు మన దేశంలో ఉండటం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. జనరిక్, హోమియోపతి, ఆయుర్వేదం, కాస్మోటిక్‌ల ద్వారా వైద్యం అందించడంలో మన దేశం ముందుందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న చర్మ వైద్యులు రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు రోజుల పాటు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వైద్యరంగంలో డీగ్రీ, పీజీలు చేస్తున్న జూనియర్ వైద్యులు చర్మ వ్యాధులపై అధ్యయనం చేసి.. పీపీటీ ప్రదర్శన ద్వారా తమ అధ్యాయనాలను గురువులకు వివరించారు. గత సంవత్సరం తమ వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు ఏదుర్కొన్నారు? వాటిని ఏ విధంగా అధిగమించారో తోటి వైద్యులతో పంచుకోవడం ద్వారా వారి జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని వారు భావిస్తున్నారు. దాదాపు 500 మంది వైద్య నిపుణులు పాల్గొని వారి సందేశాన్ని అందించారు.
ప్రజారోగ్యం కాపాడటంలో వైద్యులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కరోనా సమయంలో వారి ప్రతిభ అద్భుతం. జనరిక్, హోమియోపతి, ఆయుర్వేదం, కాస్మోటిక్‌ల వైద్యంలో మన దేశం ప్రథమంగా ఉంది. చర్మ క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా లేజర్ చికిత్స ద్వారా నయం చేయగలిగిన అధునాతన పరికరాలు, వైద్యులు మన దేశంలో ఉండటం గర్వకారణం. - శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ
ఇవీ చూడండి..
'99 శాతం రికవరీ రేటు.. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తాం'