డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని.... సమావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ సూచించారు. ఈ మేరకు ఆయన పేరు మీద ఈ నెల 6వ తేదీన విడుదలైన లేఖ మీడియాకు చేరింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని.... మౌలిక సమస్యలు పట్టించుకోకుండా ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయడం తగదని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వాహన పన్ను, డీజిల్పై వ్యాట్ పేరుతో ప్రభుత్వం ఆర్టీసీ నుంచి భారీగా డబ్బులు దండుకుంటోందని మండిపడ్డారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు మాత్రం అలాగే వదిలివేయడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. డిమాండ్లు సాధించే వరకు పోరాటం ఆపొద్దని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ సూచించారు.
ఇవీచూడండి: ఆర్టీసీపై రెండోరోజు కేసీఆర్ సమీక్ష