ETV Bharat / state

ఇంటి అద్దె విషయంలో గొడవ - యువతిపై కత్తితో దాడి చేసిన హౌస్ ఓనర్ - KNIFE ATTACK IN HYDERABAD

ఇంటి అద్దె ఇవ్వలేదని యువతిపై ఇంటి యజమాని కత్తితో దాడి - చేతికి, తలకు గాయాలు - బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు

HOUSE OWNER ATTACKED YOUNG WOMAN
Knife Attack In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 12:48 PM IST

House Owner Attacked Young Woman : హైదరాబాద్​లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి అద్దె కట్టలేదని యజమాని యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం, హైదరాబాద్​ శివారు ప్రాంతంలోని హసన్​నగర్​లో కొన్ని నెలలుగా ఒక కుటుంబం అద్దెకు ఉంటుంది. ఇంటి కిరాయి చెల్లించక పోవడంతో ఇంటి యజమాని పలుమార్లు అడిగారు. అయినా ఇవ్వకపోవడంతో కరెంట్ కట్ చేశాడు. దీంతో అద్దెకు ఉంటున్న కుటుంబానికి, యజమానికి మధ్య గొడవ జరిగింది.

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి యజమానిపై దాడికి యత్నించగా, కోపంతో యజమాని కుటుంబం అద్దెకు ఉంటున్న కుటుంబంపై దాడి చేశారు. దీంతో ఆ కుటుంబంలోని యువతి చేతికి, తలకు కత్తి పోట్ల గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.