ETV Bharat / entertainment

'ఎన్​బీకే 109' టీజర్ - స్పెషల్ అప్​డేట్​ ఇచ్చిన తమన్​! - NBK 109 TEASER UPDATE

'NBK 109' ట్రైలర్ కట్ ఫినిష్​ - త్వరలోనే రిలీజ్!

NBK 109 Teaser Update
NBK 109 Teaser Update (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 12:26 PM IST

NBK 109 Teaser Update : నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ ​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'NBK 109'. సంక్రాంతి కానుకగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ ను ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. అదేంటంటే?

కీలక అప్డేట్​ ఇచ్చిన తమన్
'NBK 109' టైటిల్​తో తెరకెక్కుతున్న మూవీ టీజర్ కట్ పూర్తయిందని తమన్ తెలిపారు. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్​ను ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే 'అఖండ-2' మ్యూజిక్ మొదటి భాగానికి మించి ఉంటుందంటూ పేర్కొన్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సారి తమన్ తమ అభిమాన హీరో బాలయ్యకు సంబంధించిన రెండు అప్డేట్లు ఇచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​​గా!
ఇక 'NBK 109' విషయానికి వస్తే, మాస్‌ యాక్షన్‌ ఎంటర్​టైనర్​గా రూపొందుతోంది. ఈ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో బాబీ దేవోల్‌ విలన్ రోల్​లో మెరవనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు స్టార్​ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'NBK 109'తో పాటు 'BB4' (బాలకృష్ణ బోయపాటి 4) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నాలుగోసారి కలిసి పనిచేయనున్నారు బాలయ్య. దసరా సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం గురించి అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. 14 రీల్స్‌ ఎంటర్​టైన్​మెంట్‌ బ్యానర్​పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తుండగా, బాలయ్య కుమార్తె తేజస్విని కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

'నన్ను క్షమించండి - NBK 109 టైటిల్ అప్డేట్ అందుకే ఇవ్వలేకపోయాం' : నాగవంశీ

'NBK109' క్రేజీ అప్డేట్- బాలయ్య కోసం 2 పవర్​ఫుల్ టైటిల్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.