ETV Bharat / state

బి-పాస్‌.. వెబ్‌సైట్‌లో పత్తాలేని పలు గ్రామాలు - పనిచేయని టీఎస్ బీ పాస్

భవన నిర్మాణాలు.. లేఅవుట్ల అనుమతులకు అందుబాటులోకి తెచ్చిన టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌ తికమక పెడుతోంది. ఈ వైబ్‌సైట్‌లో కొన్ని గ్రామాల పేర్లు కనిపించకపోవడమే సమస్యకు కారణం. సాధారణ ప్రజల ఇంటి నిర్మాణ అనుమతులకూ కష్టమవుతోంది. స్థిరాస్తి వ్యాపారులకు భూమిని విక్రయించాలనుకునే రైతులకు.. లే అవుట్లు వేసి ప్లాట్లు విక్రయించడానికి సిద్ధమవుతున్న వ్యాపారులకు కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో ఐచ్ఛికాలు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. ప్రభుత్వానికి రాబడి కూడా నిలిచిపోతోంది. పలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో ఈ సమస్య ప్రధానంగా ఉంది.

TS BPASS
TS BPASS
author img

By

Published : Jan 22, 2023, 7:49 AM IST

హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిలోని జనగామ జిల్లాలో పది మండలాలు ఉంటే మూడు మాత్రమే వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోనూ పలు గ్రామాల ఆచూకీ లేదు.

పత్తా లేదు.. భవనాలు, ప్రహరీలతో పాటు ఏ ఇతర నిర్మాణ అనుమతులకైనా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం టీఎస్‌-బీపాస్‌ విధానాన్ని ఏర్పాటు చేసింది. భూమిని వెంచరుగా మార్చడానికి తీసుకోవాల్సిన అనుమతులకు కూడా బీపాస్‌ కేంద్రంగా ఉంది. ఏక గవాక్ష పద్ధతిలో ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే అనుమతులు జారీచేయాల్సిన అన్ని శాఖలకు అది చేరుతుంది. ఆయా శాఖల అధికారులు వెబ్‌సైట్‌లోనే అనుమతులు జారీ చేస్తారు. ఈ పద్ధతి సరైనదే అయినా ఎప్పటికప్పుడు ఉన్నతీకరించకపోవడంతో పలు సమస్యలొస్తున్నాయి. వెబ్‌సైట్‌లో జిల్లా, మండలంతో పాటు గ్రామం పేరు స్పష్టంగా ఉంటేనే దరఖాస్తుదారుడు సులువుగా వివరాలు నింపి సమర్పించవచ్చు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

* మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వరంగల్‌తో పాటు కొన్ని జిల్లాల్లోని గ్రామాలు వెబ్‌సైట్‌లో లేవు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల శివారుల్లోనూ గ్రామాల పేర్లు చేర్చాల్సి ఉంది.

* వరంగల్‌లో ఒక ముఖ్య ప్రజాప్రతినిధి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని.. కార్పొరేషన్‌ శివారుల్లో వారికి చెందిన ఓ లేఅవుట్‌ అనుమతికి దారి దొరకక అవస్థ పడుతున్నట్లు స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు.

* నివాస భవనాలు, షెడ్ల నిర్మాణానికి కూడా కొందరు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో ప్రయత్నించి విఫలమై డీటీసీపీ, బీపాస్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

కలెక్టర్‌ లేఖ ఇచ్చినా... గ్రామీణ మండలాల్లో నిర్మాణాలు, వెంచర్లకు ఈ-పంచాయతీ ద్వారా, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధిలోని మండలాల వారు టీఎస్‌-బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం వెబ్‌సైట్‌ పరిధిలోకి ఆయా మండలాలను తీసుకొచ్చారు. హెచ్‌ఎండీఏతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు కూడా టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌ పరిధిలోకే వస్తాయి. అయితే, కొన్ని గ్రామాల పేర్లు ఇప్పటికీ సైట్‌లో కనిపించకపోవడం గందరగోళానికి తావిస్తోంది. నిర్మాణానికి దరఖాస్తు చేసేందుకు వెబ్‌సైట్‌ను అన్వేషించే వరకు తమ ఊరు పేరు లేదనే విషయం తెలియడం లేదు. ఈ విషయాన్ని డీటీసీపీ, బీపాస్‌ కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్‌ నుంచి లేఖ తీసుకురావాలని సూచిస్తున్నట్లు కొందరు బాధితులు చెబుతున్నారు. జనగామ జిల్లా నుంచి ఇలా లేఖ తీసుకెళ్లి సమర్పించి రెండు నెలలు గడిచినా వెబ్‌సైట్‌లో చేర్చలేదని వాపోతున్నారు. పాత పద్ధతిలో స్థానిక సంస్థల నుంచి అనుమతి పొంది డీటీసీపీకి దరఖాస్తు సమర్పించాల్సి ఉండేది. ఇతర శాఖల నుంచి అనుమతులు రావడానికి సమయం పట్టేది. బీపాస్‌ విధానం సులువుగా ఉన్నప్పటికీ గ్రామాల పేర్లు కనిపించకపోవడం ప్రధాన సమస్యగా ఉంది.

అప్పులు చేసి..తిప్పలు.. ప్రభుత్వం లేఅవుట్లు లేని స్థలాల విక్రయాలను నిషేధించడంతో జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారులు పూర్తి స్థాయి అనుమతులు పొందేందుకు సిద్ధపడుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి స్థలాలు కొనుగోలు చేశాక వెబ్‌సైట్‌ చూసి కంగుతింటున్నారు. తాము కొనుగోలు చేసిన భూమి ఉన్న ఊరు అసలు వెబ్‌సైట్‌లో లేదని తెలిసి తలపట్టుకుంటున్నారు. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి వెంట ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉందని ఓ స్థిరాస్తి వ్యాపారి చెబుతున్నారు. అధిక వడ్డీకి డబ్బు తెచ్చి వ్యాపారానికి స్థలం కొనుగోలు చేశాక అనుమతులు పొందడానికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ.. నెలల తరబడి అనుమతులు రాకపోవడంతో వడ్డీ మొత్తం చెల్లించలేక ఆర్థికంగా అవస్థ పడుతున్నామని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.