ETV Bharat / state

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు: ఠాక్రే - ఠాక్రేను కలిసిన కోమటిరెడ్డి

Congress Party Does Not Have Alliances With Any Party: రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ కాంగ్రెస్ పార్టీకి పొత్తులు ఉండవని.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​ఛార్జ్ మాణిక్​రావు ఠాక్రే స్పష్టం చేశారు. ఎవరితోనూ కలిసి పోటీ చేసే అభిప్రాయం తమకు లేదని తెలిపారు. అనంతరం శంషాబాద్ ఎయిర్​ఫోర్ట్​లో పార్టీ ఇన్​ఛార్జ్​తో కోమటిరెడ్డి భేటీ అయ్యారు.

Thakre
కాంగ్రెస్ ఇన్​ఛార్జ్​ మాణిక్​రావు ఠాక్రే
author img

By

Published : Feb 14, 2023, 7:50 PM IST

Updated : Feb 14, 2023, 8:06 PM IST

Komati Reddy Venkat Reddy Who Met Mani Rao Thackeray: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో.. బీఆర్​ఎస్​ పొత్తు పెట్టుకోక తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​ఛార్జ్​ మాణిక్​రావు ఠాక్రే స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ కలిసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ బయట మీడియాతో ఆయన మాట్లాడారు.

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని మాణిక్​రావు ఠాక్రే అభిప్రాయపడ్డారు. వరంగల్​ బహిరంగ సభలో రాహుల్ చెప్పిన మాటలకే పార్టీ కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తాను ఇంకా చూడలేదన్నారు. వ్యాఖ్యలు చేసిన వీడియోలు చూసి.. ఆ తర్వాత ఈ విషయంపై మాట్లాడతానని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీతో బీఆర్​ఎస్​ పొత్తు పెట్టుకుంటుందని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదు

ఠాక్రేను కలిసిన కోమటిరెడ్డి: మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కోమటిరెడ్డి ఎయిర్ పోర్టు లాంజీలో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావీద్‌, బోసురాజు, హర్కర్ వేణుగోపాల్‌ తదితరులు ఉన్నారు.

కోమటిరెడ్డి మాటలను తప్పుపట్టిన కాంగ్రెస్ శ్రేణులు: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పొత్తులపై మాట్లాడిన మాటలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పాటు కావడం వల్ల బీఆర్​ఎస్​.. కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకుందని చేసిన వ్యాఖ్యలపై దుమారమే రేపుతుంది. ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షులు సామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్​లు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు బదులిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో అయినా ఒంటరిగానే పోటీ చేస్తుందని.. ఎవరితో పొత్తు అవసరం లేదని వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ ఆనాడే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్​లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ, కార్యకర్తల్లోనూ గందరగోళం గురిచేసే విధంగా ఉందని పీసీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

ఈ వివాదం ఎలా వచ్చింది: రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాదని.. హంగ్ ఏర్పడే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి జోస్యం చెప్పారు. ఈ ఎన్నిక తర్వాత కాంగ్రెస్​తో కేసీఆర్ కలవక తప్పదని వ్యాఖ్యానించారు. హస్తం పార్టీలో అందరూ కష్టపడితే 40 నుంచి 50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.