ETV Bharat / state

'ములుగు జిల్లాకు సమ్మక్క, సారలమ్మ పేరు పెట్టాలి'

ములుగు జిల్లాకు సమ్మక్క, సారలమ్మ పేరు పెట్టాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్‌ బీఆర్‌కే భవన్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, రాములు నాయక్​ కలిశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీల సమస్యలపై సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చారు.

mandha krishna madiga, r krishnaiah met with cs in Hyderabad
'ములుగు జిల్లాకు సమ్మక్క, సారలమ్మ పేరు పెట్టాలి'
author img

By

Published : Feb 6, 2020, 11:03 AM IST

మేడారం అభివృద్ధికి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ములుగు జిల్లాకు సమ్మక్క, సారలమ్మ పేరు పెట్టడంతో పాటు జాతర సమయంలో వారం రోజుల పాటు సెలవు దినాలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ బీఆర్‌కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, రాములు నాయక్​ కలిశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీల సమస్యలపై సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చారు.

ఇటీవల జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్‌-1 సహా ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

'ములుగు జిల్లాకు సమ్మక్క, సారలమ్మ పేరు పెట్టాలి'

ఇవీ చూడండి: రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.