ETV Bharat / state

'ఈనెల 17న ఇందిరాపార్క్​ వద్ద సబ్బండ వర్గాల మహాధర్నా' - KCR NEWS TODAY

హైదరాబాద్​ సోమాజిగూడలోని ప్రెస్​క్లబ్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆధ్వర్యంలో రౌండ్​టేబుల్​ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మందకృష్ణ మాదిగతో పాటు.. పలు సంఘాలు హాజరయ్యాయి.

'ఈనెల 17న ఇందిరాపార్క్​ వద్ద సబ్బండ వర్గాల మహాధర్నా'
author img

By

Published : Nov 12, 2019, 7:01 PM IST

Updated : Nov 12, 2019, 9:43 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆర్టీసీని ఖతం చేయాలని చూస్తే... కేసీఆర్​ రాజకీయ జీవితాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు ఖతం చేస్తాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. హైదరాబాద్​ సోమాజిగూడలోని ప్రెస్​క్లబ్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదల వేదిక ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు.

సబ్బండ వర్గాల మహాధర్నా

ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగతో పాటు ఆయా సంఘాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా తమ భవిష్యత్​ కార్యచరణను మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఈనెల 17న ఇందిరా పార్క్​ వద్ద సబ్బండ వర్గాలు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు.

గవర్నర్​ను కలవనున్న మందకృష్ణ

ఈనెల 20న రాష్ట్ర గవర్నర్​ తమిళిసైని కలిసి ఆర్టీసీని ప్రైవైట్​ పరం చేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్న విషయాన్ని వివరించనున్నట్లు ఆయన తెలిపారు. 30న 10 లక్షల మందితో హైదరాబాద్​లో భారీ కవాతు నిర్వహించనున్నట్లు వివరించారు.

'ఈనెల 17న ఇందిరాపార్క్​ వద్ద సబ్బండ వర్గాల మహాధర్నా'

ఇవీ చూడండి: మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు మృతి

sample description
Last Updated : Nov 12, 2019, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.