హైదరాబాద్ సైదాబాద్(saidabad incident) హత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలని హీరో మంచు మనోజ్(Manchu Manoj) డిమాండ్ చేశారు. నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించాలని సూచించారు. పరారీలో ఉన్న నిందితుడు దొరికే వరకు అందరూ గాలించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మనోజ్... వారిని ఓదార్చారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తరహాలోనే ఈ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆడవాళ్లు, పిల్లలను ఎలా గౌరవించాలో మనం నిరంతరం నేర్పిస్తుండాలి. ఇది మన బాధ్యత. ఘటన జరిగి ఆరు రోజులైంది. ఇంకా ఆ రాక్షసుడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. ప్రతీ ఒక్కరు ఇది సీరియస్‌గా తీసుకుంటున్నారని తెలుసు. 24 గంటల్లో పట్టుకొని వాడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. దయచేసి దీన్ని హైలెట్ చేసి చూపించండి. వాడి ఫొటోలు విడుదల చేసి... ఎక్కడ ఉన్నా పట్టుకొని పోలీసులకు అప్పజెప్పండి.
-మంచు మనోజ్, హీరో
మాజీ ఎంపీ వివేక్(mp vivek) కూడా చిన్నారి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి కొంత ఆర్థిక సాయాన్ని అందజేశారు. కూల్చివేసిన నిందితుడి నివాసాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సత్వరమే న్యాయం చేయాలని వివేక్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: saidabad incident: రాజు ఎక్కడున్నాడు? తప్పించుకోవడానికి సహకరించింది ఎవరు?