ETV Bharat / state

ఇఫ్లూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్​ ఆత్మహత్య - man working as assistant professor in eflu died

హైదరాబాద్ తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న రాహుల్.. తన నివాసంలోని స్లాబ్ కొక్కానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం నుంచి దుర్వాసన రాగా అపార్ట్​మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు.

man working as assistant professor in eflu died
ఇఫ్లూలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్​గా పనిచేసే వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Jul 22, 2020, 10:21 PM IST

హైదరాబాద్ తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న రాహుల్​ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తార్నాకలోని శ్రీకర్ శ్రీవాస్ అపార్ట్​మెంట్ మూడో అంతస్తులోని 306 నెంబర్​లోని తన ఫ్లాట్​లో స్లాబ్ కొక్కానికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం దుర్వాసన రాగా.. అతను చనిపోయి రోజులు గడిచి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

అయితే అతని ఇంట్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ కాగితం దొరికింది. అందులో రెండు ఫోన్​ నెంబర్లు రాసి ప్లీజ్ కాల్​ మై ఫాదర్ అని రాసి ఉంది. ఆ పేపర్​లో ఉన్న నంబరుకు సమాచారమివ్వగా అతని తండ్రి వచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాహుల్​ డిప్రెషన్​తో మరణించి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.