గాంధీభవన్‌కు ఫర్ సేల్ బోర్డు పెట్టుకునే రోజు వస్తుందని భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలపై హస్తం పార్టీ నేత మల్లు రవి మండిపడ్డారు. కమలం నేతలు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భాజపాకు సమర్థవంతమైన నాయకులు, కార్యకర్తలు లేరని... అందుకే ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. కమలంలోకి చేరికలన్నీ తాత్కాలికమేనని మల్లు రవి స్పష్టం చేశారు. తెరాస భాజపాకు తోక పార్టీగా మారిందని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
భాజపాలో చేరికలన్నీ తాత్కాలికమే: మల్లు రవి - కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
భాజపా నాయకులు కాంగ్రెస్‌పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కమలం నేతల మాయమాటలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు.