ETV Bharat / state

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన: సీఎల్పీ నేత భట్టి

తెరాస ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు.

mallu bhatti vikramarka serious comments TRS party

author img

By

Published : Mar 6, 2020, 2:03 PM IST

కాంగ్రెస్​ లోక్​సభ సభ్యుడు రేవంత్​ రెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద ఆపార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. తప్పును ప్రశ్నిస్తే అరెస్టులు ఎలా చేస్తారని భట్టి మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఆరోపణలతో లోకసభ సభ్యుడిని అరెస్ట్ చేసి జైల్​కి పంపడం మొదటి సారి అని తెలిపారు. బేషరతుగా వెంటనే రేవంత్ రెడ్డిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని... విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్​పై స్పందించి స్పష్టత ఇవ్వాలన్నారు.

ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలు ఉపయోగించినట్లు ప్రభుత్వం ఆధారాలు బయటపెట్టాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్​ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. తను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాటికి స్పందించాల్సిన అవసరంలేదని శ్రీధర్​ బాబు స్పష్టం చేశారు.

'తప్పును ప్రశ్నిస్తే అరెస్ట్​ చేస్తారా?'

ఇవీ చూడండి:కేసీఆర్ కృషితో ప్రగతిపథంలో రాష్ట్రం: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.