ETV Bharat / state

Mallikarjun Kharge on Woman Declaration : 'ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను జనంలోకి తీసుకెళ్లండి.. మహిళా డిక్లరేషన్​ను బలంగా రూపొందించండి' - Congress latest news

Mallikarjun Kharge on Woman Declaration : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్​ నుంచి బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్​ విమానాశ్రయంలో రాష్ట్ర నేతలతో మంతనాలు జరిపిన ఖర్గే.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, డిక్లరేషన్లను జనంలోకి తీసుకెళ్లాలని చెప్పిన ఆయన.. మైనార్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్లను బలంగా రూపొందించాలని ఆదేశించారు.

Mallikarjun Kharge on Declaration Strategies
Mallikarjun Kharge on Womans Declaration
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 12:30 PM IST

Mallikarjun Kharge on Woman Declaration : అందరూ కలసి పని చేస్తే తెలంగాణలో విజయం కాంగ్రెస్(Congress) పార్టీదేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో 5 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నామన్న ఆయన.. తెలంగాణలోనూ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్న ఖర్గే.. సొంతవాళ్ల వెన్నుపోటుతోనే గత ఎన్నికల్లో తాను ఓడిపోయనన్నారు.

చేవెళ్ల ప్రజా గర్జన సభలో పాల్గొనడానికి శనివారం హైదరాబాద్​కు వచ్చిన మల్లికార్జున ఖర్గే.. ఈ ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్​ ఎయిర్​పోర్టులో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలిచే అవకాశాలు ఉన్నాయని.. నేతలంతా కలిసి పని చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, డిక్లరేషన్లను జనంలోకి తీసుకెళ్లాలని.. మైనార్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్లను బలంగా రూపొందించాలని ఆదేశించారు.

శనివారం ప్రజా గర్జన సభలోనూ ఖర్గే.. కేసీఆర్​ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్​ ఒక్కరి వల్ల రాలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కృషి, సోనియాగాంధి చొరవ వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రసాధనలో.. కేసీఆర్​ ఒక్కరే పోరాడినట్లు ప్రచారం చేసుకుని.. క్రెడిట్ పొందారని దుయ్యబట్టారు.

సోనియా నివాసంలో కలసినప్పుడు పార్టీని విలీనం చేయనున్నట్లు చెప్పిన కేసీఆర్(KCR).. సోనియా నివాసం బయటకు రాగానే మాట మార్చారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల కోసం 12 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇస్తోందని.. అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్​లోనే వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కచ్చితంగా తెలంగాణలో అధికారం కాంగ్రెస్ దేనన్న ఖర్గే హామీలు నెరవేర్చి చూపిస్తామని స్పష్టం చేశారు.

నెహ్రు, పటేల్ ఇద్దరు కలిసి దేశంలోని సంస్థానాలు విలీనం చేశారన్న ఖర్గే.. అందులో భాగంగానే హైదరాబాద్​ను కూడా విలీనం చేసినట్లు తెలిపారు. బీఆర్​ఎస్​, బీజేపీలు కలిసిపోయాయని ఆరోపించారు. అమిత్​ షా ఖమ్మం సభలో.. కేసీఆర్​ను​ విమర్శించరని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకం చేసిన కాంగ్రెస్.. కీలక సంస్కరణలు ప్రవేశపెట్టి అభివృద్ధి పథంలోకి నడిపిందని పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వాన్ని​ గద్దె దింపడానికి.. అన్ని పార్టీలు కలిసినా బీఆర్​ఎస్​ మాత్రం తమతో కలిసి రాలేదని ఆరోపించారు. కేసీఆర్​.. బీఆర్​ఎస్​ను సెక్యులర్ పార్టీ అని ప్రచారం చేసుకుంటూనే కమ్మునల్ బీజేపీతో చేతులు కలుపుతారని ధ్వజమెత్తారు .బీజేపీని సమర్థిస్తున్న కేసీఆర్​ని ఓడగొట్టడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కింద 12 హామీలను విడుదల చేసినట్లు తెలిపారు

Telangana Congress MLA Candidates List : సెప్టెంబర్​లో మొదటివారంలో.. కాంగ్రెస్​ అభ్యర్థుల తొలి జాబితా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.