సికింద్రాబాద్ బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్లో మల్కాజిగిరి పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించడం ఖాయమన్నారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. ప్రజలంతా కేసీఆర్ వైపే మొగ్గు చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈనెల 8నమల్కాజిగిరిలోజరిగే కేటీఆర్ సభకు మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని మల్లారెడ్డి కోరారు.
ఇవీ చూడండి:"భయమెందుకు బాబు"