సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్లను వెంటనే తెరవాలని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ సీఈవో అజిత్‌రెడ్డితో కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలో మూసి ఉన్న రోడ్లను ఆయన పరిశీలించారు. అక్కడి సమస్య గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మారేడ్‌పల్లిలోని లక్ష్మీనగర్, 108 బజార్లలో పర్యటించారు.
ప్రజలకు నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా ఆర్మీ అధికారులు మూసివేసిన రోడ్లను తక్షణమే కంటోన్మెంట్ అధికారులు తెరవాలని కోరారు. రోడ్ల మూసివేత వల్ల స్థానికులు ఇతర ప్రాంతాల మీదుగా ఇంటికి రావాల్సి వస్తోందని.. తద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి