ఇటీవల కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మనోజు మృతి తనని ఎంతో కలిచివేసిందని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కుటుంబానికి రూ.లక్ష
బాధిత కుటుంబానికి తన వంతుగా రూ.లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. వార్త సేకరణలో భాగంగా విధుల్లో ఉన్న జర్నలిస్టులు మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని సూచించారు.
ఇవీ చూడండి : 'ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే వారిపై చర్యలు తీసుకోండి'