జంట నగరాల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడ మైదానంలో బల్దియా అధికారులు నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల పరిధిలో పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం కార్యక్రమానికి 2014 నుంచే అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని తెలిపారు. వివిధ పార్కులు, ప్రాంగణాలను హరిత వనాలుగా మార్చామన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను స్థానిక బస్తీ, కాలనీ సంఘాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లష్కర్‌ను హరితవనంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
ఇదీ చూడండి :చంద్రయాన్-2 ల్యాండింగ్‌ను వీక్షించనున్న ప్రధాని