ఈ సేవలకు ఓకే
లాక్డౌన్ 3.0లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సేవలకు కేంద్రం అనుమతి. అవేంటో తెలుసా...
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ సేవలకు కేంద్రం ఓకే
ఈత కొట్టిన ఎంపీ
మల్లన్నసాగర్ నాలుగో గేట్ ద్వారా విడుదలైన నీటిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈత కొట్టారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆయనకి తోడయ్యారు..
రూ.50కే రైలు టికెట్..
దేశంలో ఎక్కడికెళ్లినా రైలు టికెట్ 50 రూపాయలే. కంటైన్మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం. ఇప్పటికే మార్గదర్శకాలిచ్చాం. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
'
కరోనా' సీజ్
కరోనా హడలెత్తిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. వనస్థలిపురంలోని జీవన్‌సాయి ఆసుపత్రిదీ ఇదే తీరు. ఇవాళ హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు.
కేటీఆర్ సమీక్ష
కేంద్రం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష. జీహెచ్ఎంసీలో ఆంక్షల సడలింపుపై సమాలోచనలు.
ప్రమాణ స్వీకారం
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది.
ప్రభుత్వ వైఖరేంటి?
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ గడవును పొడగించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుబోతున్నారు? సర్వత్రా ఉత్కంఠ!
అమ్మా.. నాన్నకేమైంది?
నాన్నేమో లేవట్లేదు. అమ్మేమో ఏడుస్తోంది. జనాలందరూ మమ్మల్ని అదోలా చూస్తున్నారు. మా కన్నీరు అక్కడెవరికీ కనిపించడం లేదు. నారాయణగూడ బొగ్గులకుంట కూడలిలో చిన్నారుల కన్నీటి గాథ.
నడక యాతన
ఓ వలస కార్మికుడు 16 రోజులుగా తన భార్య , చంటి బిడ్డతో నడకయాతన చేస్తున్నాడు. పొట్టకూటి కోసం ఊరుకాని ఊరొస్తే.. కడుపు మాడుతోంది. చేసేందుకు పని లేదు. తినేందుకు తిండి లేదు. ఆ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికంటే...
చంకలో బిడ్డ, నెత్తిన మూటతో 16 రోజులుగా పాదయాత్ర!
ఏపీలో మరో 62
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 62 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,525కు చేరింది.
బోర్డర్లో 'కరోనా' కలవరం
దేశ భద్రతలో భాగంగా విధులు నిర్వర్తించే జవాన్లను కూడా కరోనా వదలడం లేదు. తాజాగా 68 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
కిమ్ ఇలా కనిపించారు
ఉత్తరకొరియా అధినేత కింగ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారట! ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ ఆయన బతికే ఉన్నారని దృశ్యాలు విడుదల చేసిన ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ కొరియన్ సెంట్రల్.
మై డియర్ బచ్చా
మెగాస్టార్ చిరంజీవి సైటర్ వేశారు. ఎవరిపై అనుకుంటున్నారు? ఎవరో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ మీదే. ఎందుకంటే..