మహిళలను రక్షించండి మానవ మృగాలను శిక్షించండి అంటూ సికింద్రాబాద్ ప్యారడైజ్ గాంధీ విగ్రహం వద్ద మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రానికి అసలు హోంమంత్రి ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అరాచకాలు, ఆకృత్యాలు, అత్యాచారాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. హోమాలు చేయడానికి, స్వామీజీలను కలవడానికి కేసీఆర్కు సమయం ఉన్నప్పడు...అత్యాచార బాధితులను పరామర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు.
అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఘటనకు కారకులైన తెరాస నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలంతా చైతన్యవంతులై ఎవరైనా దాడి చేయాలని ప్రయత్నస్తే ప్రతి దాడి చేయాలని ఆమె సూచించారు.
ఇవీ చూడండి : గోదావరిలోకి చేరుతున్న వరద నీరు... తెగిపోయిన డ్యాం