Congress Complaint on Assam CM: మహిళలపై భాజపాకు ఏమాత్రం గౌరవం ఉన్నా రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. హిమంత బిశ్వశర్మపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ మహిళా నాయకులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల తదితరులు మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు.
అసోం ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని స్పష్టం చేసిన సునీతా లక్ష్మారెడ్డి.. జాతీయ మహిళ కమిషన్‌కు నివేదిస్తానని ఆమె చెప్పినట్లు కాంగ్రెస్ మహిళ నాయకురాళ్లు తెలిపారు. హిమంత బిశ్వశర్మపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ మహిళా నేతలు స్పష్టం చేశారు.
మాతృత్వం అనే శబ్ధానికి అర్థం లేకుండా మాట్లాడిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలి. భాజపాకు, ప్రధాని మోదీకి మహిళలపై ఏమైనా గౌరవం ఉంటే ఆయనను వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలి.
-గీతారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి మహిళల గురించి అగౌరవంగా మాట్లాడితే దీనికి చట్టాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త హేమంత బిశ్వశర్మ. -రేణుకా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మేం ఖండిస్తున్నాం. మహిళలను గౌరవించండి. సోనియా గాంధీ కుటుంబానిది త్యాగాల చరిత్ర. మేం అడిగింది సర్జికల్ స్ట్రయిక్స్ గురించి.. భాజపాకు దమ్ముంటే సర్జికల్ స్ట్రయిక్స్ గురించి మాట్లాడండి. అనవసరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం.
-సునీతారావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు
ఇదీ చదవండి: