పోలీస్ స్టేషన్లలో కేసులున్న కానిస్టేబుల్ అభ్యర్థులను... శిక్షణకు ఎంపిక చేయలేదని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే వాళ్లపై కేసులు క్లియర్ అయిన విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారని.... కేసులు కొనసాగుతున్న వాళ్లపై మాత్రం పోలీస్ నియామక మండలి నిర్ణయం తీసుకుంటుందని మహమూద్ ఆయన స్పష్టం చేశారు.
భైంసాలో ప్రస్తుతం శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని... అందుకు కారణం పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడమేనని మహమూద్ అలీ తెలిపారు. మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక అని... భైంసాలో తలెత్తిన వివాదం సమసిపోయిందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: "అధికారంలోకి వచ్చాం.. అభివృద్ధి చేసి చూపాం"