వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. మాదాపుర్ శిల్పారామం సందర్శకులతో కిటకిటాలాడుతోంది. ఎటు చూసిన పచ్చదనం, పూలతో నిండుగా కనువిందు చేస్తోంది. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులతో సందర్శకులను మరింత ఆకట్టుకుంటుంది
కొవిడ్ నియంత్రణలు పాటిస్తూ..
సందర్శకులు సురక్షితంగా, ఆహ్లదంగా గడపటానికి శిల్పారామంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపట్టింది. సందర్శకుల కోసం ఫుడ్ కోర్ట్స్‌తో పాటు .. పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో నగరం నలుమూలల నుంచి సందర్శకులు కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా శిల్పారామంలో ఆహ్లాదకరంగా గడుపుతున్నారు.
అలరించింది..
ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళలో భాగంగా .. ఆంఫి థియేటర్‌లో శ్రీమతి వైష్ణవి సాయినాథ్ శిష్య బృందంచే నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన సందర్శకులను ఎంతగానో అలరించింది.
ఇదీ చదవండి:2021లో ప్రపంచ రక్షకుడుగా భాగ్యనగరం.. కొవిడ్‌పై యుద్ధభేరి