ETV Bharat / state

వాళ్లొచ్చే వరకు ఇళ్ల బాధ్యత, భద్రత మనదే.. సిబ్బందితో కలిసి సైకిల్‌పై డీసీపీ గస్తీ - Sankranti festival

Madapur DCP Patrolled on Bicycle : సంక్రాంతి పండుగ దృష్ట్యా హైదరాబాద్ నగరంలో పోలీసులు నిఘా పెంచారు. ఇప్పటికే చాలా మంది సొంతూళ్లకు పయనం కావడంతో ఎక్కడా దొంగతనాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేశారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తోటి సిబ్బందితో కలిసి సైకిల్‌పై గస్తీ నిర్వహించడంతో పలువురు ప్రశంసించారు.

DCP Shilpavalli patrolling
DCP Shilpavalli patrolling
author img

By

Published : Jan 14, 2023, 3:34 PM IST

సిబ్బందితో కలిసి సైకిల్‌పై గస్తీ నిర్వహిస్తోన్న డీసీపీ శిల్పవల్లి

Madapur DCP Patrolled on Bicycle : మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మియాపూర్ పీఎస్ పరిధిలోని పలు కాలనీల్లో సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. మదీనాగూడా, ఆల్విన్ కాలనీ, ఉషోదయ కాలనీల్లో మియాపూర్ పోలీసులతో కలిసి కలియతిరిగారు. పండుగ సందర్భంగా కాలనీల ప్రజలు ఇళ్లకు తాళం వేసి సొంతూర్లకు వెళ్లారు. ఇప్పటికే పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత గస్తీ నిర్వహిస్తూ.. తాళం వేసిన ఇళ్లపై నిఘా పెట్టారు. డీసీపీ శిల్పవల్లి సైతం క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఉత్సాహపరిచేలా సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. ఆయా కాలనీల్లో ఉన్న సీసీ కెమెరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. పండుగకు వెళ్లిన వాళ్లు మరో మూడు రోజుల పాటు సొంతూళ్లలోనే ఉండే అవకాశం ఉండటంతో ఎక్కడా దొంగతనాలు చోటుచేసుకోకుండా పక్కాగా గస్తీ నిర్వహించాలని డీసీపీ.. తోటి సిబ్బందికి సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.