ETV Bharat / state

lands scam: భూమి లేకున్నా ఆన్​లైన్​లో ఎలా చూపిస్తోంది.. రుణమెలా మంజూరవుతోంది? - Guntur District Latest Crime News

అడిగేవారు లేరని.. ఉద్యోగ విరమణకు పది రోజుల ముందు ఏపీలోని గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఓ రెవెన్యూ అధికారి అక్రమాలు అన్నీఇన్నీ కావు.  అధికార పార్టీ నేతలు కొందరు దీనికి అండదండలు అందించారు. ప్రభుత్వ భూమి ఉన్న సర్వేనంబర్లను ఆన్‌లైన్‌లో పట్టా భూమిగా మార్చి సర్వేనంబరును సబ్‌డివిజన్‌ చేసినట్లు చూపి అనుకున్నవారి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసేశారు. ఇలా చేయించుకున్నవారు సొసైటీలు, బ్యాంకులలో పంట రుణాలు తీసుకున్నారు. సహకరించిన అధికార యంత్రాంగానికి ముడుపుల రూపంలో ప్రతిఫలం ముట్టజెప్పారు. ఇదంతా రెవెన్యూ అధికారితోపాటు ఒక వీఆర్వో, పొరుగుసేవల ఉద్యోగి సహకారంతో జరగడం  గమనార్హం. రుణాలు పొందేందుకు చేసిన అక్రమాలు ‘ఈనాడు-ఈటీవీ భారత్’ పరిశీలనలో బయటపడ్డాయి.

lands scam
lands scam
author img

By

Published : Sep 14, 2021, 11:38 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లా మాచవరం తహసీల్దారు కార్యాలయంలో ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన అధికారి కేంద్రంగా ఆన్‌లైన్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. భూమి లేని వారికి కూడా భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు. మండలంలోని 4గ్రామాల పరిధిలో ఎవరి పేరు ఏ సర్వేనంబరు వద్ద కావాలంటే అక్కడ నమోదు చేశారు. ఇందుకు ఎకరాకు రూ.10వేల చొప్పున లబ్ధిదారుల నుంచి వసూలుచేశారు. ఇలా నమోదు చేయగానే ఆ వివరాలతో బ్యాంకు రుణానికి దరఖాస్తు చేసుకుంటారు. బ్యాంకులు పంట రుణమిచ్చే ముందు ఆన్‌లైన్‌లో భూమి వివరాలు సరిచూసుకుంటాయి. ఇక్కడ ఎక్కువగా మిర్చి పండిస్తుండటంతో ఎకరాకు రూ.లక్ష వరకు రుణమిస్తున్నాయి.

పంట రుణం మంజూరుకాగానే అంతకుముందు నమోదు చేసిన పేర్లను ఆన్‌లైన్‌లోనుంచి తొలగిస్తున్నారు. కొందరి పేర్లు ఇప్పటికీ తొలగించకుండా అలాగే ఉంచారని తెలుస్తోంది. భూమి లేకపోయినా ఆన్‌లైన్‌లో చూపించి రూ.కోట్ల సొమ్మును బ్యాంకులనుంచి పంట రుణాల రూపంలో పొందారు. ఇలా 3బ్యాంకుల పరిధిలో రూ.కోట్ల సొమ్ము స్వాహా చేశారు. వీఆర్వో వద్దకు రైతులు వస్తే పొరుగు సేవల ఉద్యోగికి చెప్పి రికార్డులు తారుమారు చేయించి ఇద్దరూ కలిసి భారీ సొమ్ము ఆర్జించినట్లు సమాచారం. రెవెన్యూ అధికారికి తెలియకుండా కూడా కొన్నింటిని చక్కబెట్టడం గమనార్హం. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పొరుగు సేవల ఉద్యోగి వద్దే ఉండటంతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమాల్లో పాలుపంచుకున్న వీఆర్వో.. మరో గ్రామానికి చెందిన వీఆర్వోను సైతం తప్పించి ఇన్‌ఛార్జిని పెట్టుకొని మరీ అక్రమాలకు తెరలేపారు.

  • మాచవరం మండలం మోర్జంపాడు, తురకపాలెం, కొత్తపాలెం కలిసి ఆకురాజపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయి. మోర్జంపాడు కిందనే తాడుట్ల ఉంది. రెవెన్యూ గ్రామం వేరే అయినా సచివాలయం అక్కడే ఉండటంతో అక్రమాలకు అవకాశమేర్పడింది. చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలోనూ ఇలా అక్రమాలు జరిగాయి.
  • సెప్టెంబరు 2020 నుంచి 2021 మే31 వరకు అక్రమాలు కొనసాగాయి. ఈ కాలంలో సదరు అధికారి దాచేపల్లి మండలంలో పనిచేసినా గాని మాచవరంలోనూ ఇన్‌ఛార్జిగా కొనసాగేలా చూసుకున్నారు.
  • మే2021లో 20వ తేదీ నుంచి 31వరకు మాచవరం మండలంలోని అడంగల్‌లో 1600 రికార్డులు మార్పులు చేయడం గమనార్హం.
  • మాచవరం మండలంలో కొందరికి భూమి లేకపోయినా సుమారు 500 ఎకరాలకుపైగా ఉన్నట్లుగా ఆన్‌లైన్‌లో చూపి బ్యాంకు రుణాలు పొందారు.
  • వేమవరం గ్రామం సర్వేనంబరు 404-39లో 53.68 ఎకరాలు బండిదారి, కాలువగా ఉంటూ ప్రభుత్వ భూమిగా నమోదైంది. దీనిని పట్టా భూమిగా మార్చి విస్తీర్ణాన్ని 64.73 ఎకరాలకు పెంచి 40 మందికి ఒక్కొక్కరికి 2నుంచి 5ఎకరాలవరకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇది మొత్తం ప్రభుత్వ భూమి అయినప్పటికీ ప్రైవేటువారి పేరుతో నమోదు చేశారు. పంటరుణాలు తీసుకున్నాక ఆన్‌లైన్‌ నుంచి తొలగించారు. అయితే ఇప్పటికీ ముగ్గురి పేర్లు తొలగించకుండా వారికి 5.16 ఎకరాలు వారసత్వంగా వచ్చినట్లు చూపారు.
  • ఆకురాజుపల్లిలో సర్వేనంబరు 464-15-1లో 60.70 ఎకరాలు ప్రైవేటు భూమి ఉంది. ఖాతానంబరు 2877లో ఒక మహిళ పేరుతో 4.88 ఎకరాలు నమోదు చేశారు. మరొకరికి 2879 ఖాతానంబరులో 4.34 ఎకరాలు రాశారు. అయితే వీరికి ఇక్కడ సెంటుభూమి కూడా లేదు.
  • తాడుట్ల రెవెన్యూ పరిధి సర్వేనంబరు 103-79ను కొత్తగా సృష్టించి 8.11 ఎకరాలను మోర్జంపాడుకు చెందిన ఒక అధికార పార్టీ నేత కుటుంబసభ్యుల పేర్లతో ఆన్‌లైన్‌లో ఎక్కించారు.
  • తాడుట్లలో సర్వేనంబరు 417లో వాగుభూమి, ప్రభుత్వ భూమి కింద 8.71 ఎకరాలు ఉంది. దీనికి కొత్త సబ్‌డివిజన్లు సృష్టించి ఆరుగురి పేర్లు ఎక్కించారు. వీరి పేరున ముగ్గురికి వారసత్వం, ముగ్గురికి డీకే పట్టా ఇచ్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
  • తాడుట్ల రెవెన్యూ పరిధిలో 413-7, 413-8 సర్వేనంబర్లలో పిడుగురాళ్ల పొరుగు సేవల సిబ్బందిగా పనిచేస్తున్న వ్యక్తి కుటుంబీకుల పేర్లతో 15 ఎకరాల భూమి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
  • పిల్లుట్లలో సర్వేనంబరు 864-2డిలో ప్రభుత్వ భూమి 3.90 ఎకరాలు ఉండగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురి పేర్లతో ఒక్కొక్కరికి అరెకరా నుంచి ఎకరం వరకు ఎక్కించారు. ఇవన్నీ ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి.
  • పిల్లుట్లలో సర్వేనంబరు 336-బీ1, 524-3, 625-బీ, 896-ఏ, 1255-18-3బీలలో 5.76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ప్రైవేటుగా మార్చి ఒకే కుటుంబంలోని ఇద్దరి పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

డిప్యూటీ కలెక్టర్‌తో విచారణ

మాచవరం మండలంలో భూఅక్రమాలు, రికార్డుల మార్పులపై జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ దృష్టికి ‘ఈనాడు’ తీసుకెళ్లగా ప్రత్యేకంగా డిప్యూటీ కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమించి దర్యాప్తు చేయిస్తామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటువారి పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు.

ఇదీ చూడండి: 20ఎకరాల ప్రభుత్వ భూమిపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.