ETV Bharat / state

LPCET: ఎల్​పీ సెట్​ నోటిఫికేషన్​ విడుదల - telangana varthalu

ఐటీఐ చ‌దివిన వారు పాలిటెక్నిక్ రెండో సంవ‌త్స‌రంలో ప్ర‌వేశం పొందేందుకు రాసే ఎల్‌పీ సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. రాష్ట్ర సాంకేతిక విద్యామండ‌లి ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

lpcet notification released
ఎల్​పీ సెట్​ నోటిఫికేషన్​ విడుదల
author img

By

Published : Jun 10, 2021, 4:42 PM IST

ఐటీఐ చదివిన విద్యార్థులకు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్​పీ సెట్ నోటిఫికేషన్​ను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. వంద రూపాయల ఆలస్య రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని.. 23వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని పేర్కొన్నారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని నవీన్ మిత్తల్ తెలిపారు.

మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎల్​పీ సెట్ పరీక్షా కేంద్రం ఉంటుందన్నారు. పరీక్ష జరిగిన పది రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నట్లు నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలు 300 రూపాయలు, మిగతా అభ్యర్థులు 500 రూపాయలు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు http://sbtet.telangana.gov.in లేదా మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో తెలుసుకోవాలని నవీన్ మిత్తల్ సూచించారు.

నోటిఫికేషన్​ వివరాల కోసం: క్లిక్​ చేయండి

ఇదీ చదవండి: ఫుడ్​ డెలివరీ గర్ల్​గా ఇంటర్​ అమ్మాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.