ETV Bharat / state

కదలని లారీ చక్రం... దిక్కుతోచని మార్గం - Covid-19 pandemic in india

లారీ చక్రం నడిస్తే కానీ... బతుకు బండి నడవని పరిస్థితి. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచీ లారీల చక్రాలకు తాళం పడింది. అసలు ఎప్పుడు బతుకుబండి పరుగెడుతుందో తెలియని పరిస్థితిలో లారీల యాజమానులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విపత్కర పరిస్థితిలో తమ గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుతున్నారు.

lorry owners struggled due to corona effect
కదలని చక్రం... దిక్కుతోచని మార్గం
author img

By

Published : Apr 9, 2020, 7:44 AM IST

కరోనా ప్రభావం లారీ యజమానులను తీవ్రంగా దెబ్బతీసింది. లాక్​డౌన్ అమలుతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాలు, పరిశ్రమలు మూతపడడం వల్ల లారీ చక్రాలు నిలిచిపోయాయి. చక్రం తిరిగితే తప్ప తమ బతుకు బండి నడవదని... ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వాలు లారీ యజమానుల గురించి ఆలోచించాలని కోరుతున్నారు.

ఈ పరిస్థితిలో అటు ఓనర్లతో పాటు డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది లారీ రవాణాపై ఆధారపడినవారంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల కిస్తీలు ఎలా కట్టాలనే దిగులు యజమానులకు పట్టుకుంది. ప్రస్తుతానికి ఆర్బీఐ మూడు నెలల కిస్తులు ఆపి మారిటోరియమ్​ పద్ధతిలో చెల్లిచేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ ఈ మూడు నెలలకు సంబంధించిన వడ్డీ... లేనిచో లాక్​డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు సంబంధించి ఆయా లారీలపై వడ్డీలను ఎత్తివేయాలని యజమానులు కోరుతున్నారు.

లారీల ఇన్సూరెన్స్​కు సంబంధించి ఈ మూడు నెలల ఇన్సూరెన్స్ మరో మూడు నెలలకు ఎక్స్చేంజ్ వర్తింపచేయాలని లారీ యజమానులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : 'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.