ETV Bharat / state

పొమ్మనలేక పొగ పెడుతున్నారు.. లారీ యజమానుల ఆవేదన..

Lorry owners are protesting at TSMDC: రాష్ట్రవ్యాప్తంగా టీఎస్​ఎమ్​డీసీ అధికారికంగా నిర్వహిస్తున్నటు వంటి ఇసుక క్వారీల్లోకి.. ఆన్​లైన్​ డీడీ బుక్ చేసుకొని లోడింగ్​కు వెళ్లేటప్పుడు కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సంఘం నాయకులు ఆరోపించారు. హైదరాబాద్​లోని టీఎస్​ఎమ్​డీసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కాంట్రాక్టర్లు అధిక లోడ్​లు వేయడం వల్ల అధికారుల తనిఖీల్లో అధిక మొత్తంలో చలాన్లు విధించడంతో తీవ్ర నష్టాలను చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Lorry owners are protesting at TSMDC
లారీ యజమానుల ఆందోళన
author img

By

Published : Dec 19, 2022, 5:01 PM IST

Lorry owners are protesting at TSMDC: రాష్ట్రవ్యాప్తంగా టీఎస్​ఎమ్​డీసీ అధికారికంగా నిర్వహిస్తోన్న ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్లు.. లారీ యజమానులను ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఇసుక లారీల యజమానుల సంఘం హైదరాబాద్​లో ఆందోళనకు దిగారు. ఇసుక లారీల యజమానుల వేధింపులకు పాల్పడుతున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఖైరతాబాద్​లోని తెలంగాణ రాష్ట్ర మినరల్ అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.

కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు, లారీ యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్​ఎమ్​డీసీ అధికారికంగా నిర్వహిస్తున్నటు వంటి ఇసుక క్వారీలలోకి.. ఆన్​లైన్​ డీడీ బుక్ చేసుకొని లోడింగ్​కు వెళ్లేటప్పుడు కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సంఘం నాయకులు ఆరోపించారు. అక్రమ వసూళ్లకు అలవాటు పడిన కాంట్రాక్టర్లు బలవంతంగా లారీల్లోకి అదనంగా ఓవర్ లోడ్లు వేయడం వలన ఆ లోడ్​లను నింపుకొని హైదరాబాద్​, ఇతర నగరాలకు చేరుకునే సమయాల్లో లారీలను పోలీస్​ శాఖ, రవాణా శాఖ, మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ శాఖల వారు తనిఖీలు నిర్వహించి అధిక మొత్తంలో చలాన్లు విధించడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల కొంతమంది అప్పుల పాలు అవుతున్నారని.. మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.

డ్రైవర్​లను నానా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. లారీలకు దొడ్డు ఇసుక, మట్టితో కూడిన ఇసుక నింపి కాంట్రాక్టర్లు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్​ట్రా బకెట్లు వేసుకున్నప్పుడు ఏ విధంగానైతే లోడింగ్ జరిపించారో.. మళ్లీ అదే విధంగా చర్యలు తీసుకోవాలని లారీ యాజమానుల సంఘం వారు కోరారు. అదే విధంగా విజయవాడ నుంచి జీరో ఇసుక తెచ్చారనే కారణం చేత.. లారీలను టీఎస్​ఎమ్​డీసీ వారు బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందన్నారు. అందులో కొన్ని టీఎస్​ఎమ్​డీసీ నిర్వహించిన క్వారీల నుంచి లోడైన బండ్లు కూడా ఉన్నాయని తెలిపారు. జీరో ఇసుక తోలడం ముమ్మాటికి తప్పే అని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచే జీరో ఇసుక తోలకూడదు.. ఎక్స్​ట్రా బకెట్లు వేసుకోకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు తీర్మానం చేసుకున్నాయని తెలిపారు. ఈ బ్లాక్ లిస్టులో ఉన్న లారీలన్నింటినీ తొలగించి పాసింగ్ తోలుకోవడానికి అవకాశం కల్పించాలని లారీ సంఘాలు కోరుకున్నాయి.

టీఎస్​ఎమ్​డీసీ వద్ద ఆందోళనలు చేస్తున్న లారీ యజమానులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.