Lorry Stuck at Railway Crossing: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో రైల్వే క్రాసింగ్ వద్ద లారీ ఇరుక్కుపోవటతో ఒకింత ఆందోళన నెలకొంది. వేమూరు మండలం పెనుమర్రు స్టేషన్ సమీపంలో ఉన్న లెవల్ క్రాసింగ్ వద్ద లారీ సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. అదే సమయానికి రేపల్లె నుంచి గుంటూరుకు వెళ్లే ప్యాసింజర్ రైలు వచ్చింది. రైలు డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ముందుగానే రైలును ఆపివేశారు.
విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు లారీని ట్రాక్టర్కు కట్టి స్థానికుల సహకారంతో లారీని గేటు బయటకు లాగారు. ఫలితంగా రైలు వెళ్లడానికి మార్గం సుగమం అయింది. ఈ ఘటన వల్ల దాదాపు 40 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది.
ఇవీ చదవండి: