ETV Bharat / state

ఉద్యోగిపై నుంచి టిప్పర్​ లారీ దూసుకెళ్లింది - లక్డికాపుల్ వద్ద లారీ కింద పడి ఓ వాహనదారుడు మృతి

రోజూలాగే ఓ ఉద్యోగి బైక్​పై వెళ్తున్నాడు... ప్రమాదవశాత్తు డివైడర్​ను ఢీకొట్టి వెనక నుంచి లోడ్​తో వెళ్తున్న లారీ వెనుక టైర్ల కింద పడ్డాడు. అంతే అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

lorry accident on employee at lakdikapul hyderabad
ఉద్యోగిపై నుంచి టిప్పర్​ లారీ దూసుకెళ్లింది
author img

By

Published : May 18, 2020, 4:09 PM IST

హైదరాబాద్​ లక్డికాపుల్ వద్ద లారీ కింద పడి ఓ వాహనదారుడు మృతి చెందాడు. లక్డికాపుల్ నీరంకారి భవన్ మలుపు వద్ద డివైడర్ ఢీకొట్టి లోడ్​తో వెళ్తున్న లారీ వెనుక టైర్ల కింద పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందడం వల్ల సైఫాబాద్ పోలీసులు లారీ డ్రైవర్ ఇర్ఫాన్​ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు ఆఫీసర్స్ మెస్​లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై మాసబ్ ట్యాంక్ నుంచి కోఠి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఉద్యోగిపై నుంచి టిప్పర్​ లారీ దూసుకెళ్లింది

ఇదీ చూడండి : రోడ్డుపైనే కాదు.. కాన్వాస్​పైనా గీస్తూ అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.