ETV Bharat / state

'ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర విధానం అవసరం'

Loksatta on Health Situation in Telangana: ప్రభుత్వాలు చేయాల్సిన పనులను పక్కనపెట్టి అనవసరమైన పనులు చేస్తున్నాయన్నాయని లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. పాలకులు స్పష్టమైన వైద్య విధానాన్ని అనుసరించని కారణంగా పలు విపత్కర సమయాల్లో ప్రాణ నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.

'ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర విధానం అవసరం'
'ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర విధానం అవసరం'
author img

By

Published : Feb 13, 2022, 5:20 PM IST

Loksatta on Health Situation in Telangana: గత 70 ఏళ్లుగా దేశాన్ని పాలించిన పాలకులు స్పష్టమైన వైద్య విధానాన్ని అనుసరించని కారణంగా పలు విపత్కర సమయాల్లో ప్రాణ నష్టం జరుగుతోందని లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లోక్​సత్తా పార్టీ 'అందరికీ ఆరోగ్యం-హక్కుగా వైద్య సేవలు' అంశంపై సదస్సు నిర్వహించింది. కరోనా మహమ్మారి ఈ నేపథ్యంలో వైద్య విధానాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం లభించిందని.. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వివక్షతను నిర్మూలించాలి..

ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, స్వేచ్ఛ మాత్రమే కాదన్న ఆయన.. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను పక్కనపెట్టి అనవసరమైన పనులు చేస్తున్నాయన్నారు. విద్యావ్యవస్థలో ఉన్న గ్రేడింగ్ మార్కులు, ర్యాంకులు పనికిరావన్న జేపీ.. ప్రతిభతో రాణించవచ్చన్నారు. ప్రస్తుతం సమాజంలో అనారోగ్యం, అకాల మరణం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పలు నివేదికలు కూడా వెల్లడించాయన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి వివక్షతను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆరోగ్యశ్రీ అందరికీ వర్తింపజేయాలి..

ప్రభుత్వాల్లో ఆరోగ్యంపై స్పష్టమైన విధానం లేని కారణంగానే అట్టడుగు వర్గాల ప్రజలు మెరుగైన వైద్యానికి దూరమవుతున్నారని జయప్రకాశ్​ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ అందరికీ వర్తింపజేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వైద్య వ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు లేక పేద ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. సంవత్సరానికి ఆరు కోట్ల మంది ప్రజలు వైద్య ఖర్చులు భరించలేక ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఉన్న నిధులతో, సదుపాయాలతో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి అనేక మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.

విధాన లోపం కనపడుతోంది..

అనారోగ్యం, అకాల మరణాల కారణంగా దిగువ మధ్య తరగతి కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనేది తెలుగునాట నుంచే వచ్చింది. దానికి గర్వపడాలి. ఆరోగ్యశ్రీ అందరికీ వర్తింపజేయాలి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వైద్య వ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు లేక పేద ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. మనదేశం ఉన్న పరిస్థితుల్లో ఒక విధాన లోపం కనపడుతోంది.

-జయప్రకాశ్​ నారాయణ, లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపకులు

'ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర విధానం అవసరం'

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.