ETV Bharat / state

నేర పరిశోధనపై ఆచరణాత్మక చర్చలు జరుపుతాం: జయప్రకాష్​ నారాయణ - loksatta jayapraksh narayan news

నేర పరిశోధనను బలోపేతం చేయడం ఎలా...? పరిష్కార మార్గాలు ఏంటి? వంటి అంశాలపై 'చట్టబద్దపాలన- సంస్కరణలు' పేరిట జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు లోక్​సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు.

jp
నేర పరిశోధనపై ఆచరణాత్మక చర్చలు జరుపుతాం: జయప్రకాష్​ నారాయణ
author img

By

Published : Feb 16, 2021, 4:09 PM IST

'చట్టబద్దపాలన- సంస్కరణలు' పేరిట ఈనెల 20 నుంచి 28 వరకు దృశ్యమాధ్యమంలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు లోక్​సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ వెల్లడించారు.

ఈ సదస్సులో పోలీస్​ వ్యవస్థ, నేర పరిశోధన, ప్రాసిక్యూషన్, న్యాయవ్యవస్థలపై.. ఆచరణాత్మక చర్చలు జరుపుతామన్నారు. నేర పరిశోధనను బలోపేతం చేయడం ఎలా...? పరిష్కార మార్గాలు ఏంటి? అనే అంశాలపైనా సమాలోచనలు చేస్తామన్నారు. దేశంలోని న్యాయస్థానాల్లో 3.6 కోట్ల కేసులు పెండింగ్​లో ఉన్నాయని సాక్షాత్తు మాజీ ప్రధాన న్యాయమూర్తే చెప్పారని.. జయప్రకాష్ నారాయణ్ అన్నారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, భారతీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్​తో కలిసి ప్రజాస్వామ్య పీఠం ఈ-సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయకోవిదులు, పోలీసులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారన్నారు.

jp
కరపత్రాలు ఆవిష్కరణ

ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమాజిగూడలోని ప్రెస్​క్లబ్​లో ఆవిష్కరించారు. ప్రతిఒక్కరూ ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాలని జయప్రకాష్​నారాయణ కోరారు.

నేర పరిశోధనపై ఆచరణాత్మక చర్చలు జరుపుతాం: జయప్రకాష్​ నారాయణ

ఇవీచూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.