ETV Bharat / state

కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ - BJP Kisan Morcha Latest News at hyderabad

దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం మన పాలకులే అని లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై హైదరాబాద్‌ సోమాజీగూడలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

loksatta-jayaprakash-narayan-said-the-new-agricultural-laws-will-benefit-farmers
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ
author img

By

Published : Oct 2, 2020, 5:41 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ

ప్రపంచంలో 12 శాతం వ్యవసాయ భూమి ఉండి... ప్రకృతి అనుకూలించినా జాతీయాదాయంలో వ్యవసాయరంగ వాటా చాలా తక్కువ అని లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ఆహారధాన్యాల ఎగుమతి నిషేధించడం తెలివితక్కువ పని ఆయన అభిప్రాయపడ్డారు. అస్తవ్యస్త విధానాలతో రైతుల నడ్డి విరగ్గొడుతున్నారని జేపీ విమర్శించారు. హైదరాబాద్‌ సోమాజీగూడలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ వ్యవసాయరంగ నిపుణులు హాజరయ్యారు.

"కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి. మన దేశంలో వర్షపాతం, సూర్యకాంతి ఎక్కువ. మన వ్యవసాయ రంగానికి అది పెద్ద వరం. ప్రకృతి అనుకూలత ఉంటుంది. కానీ జాతీయాదాయంలో వ్యవసాయరంగ వాటా చాలా తక్కువ. మనదేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం పాలకులే.

మన గిడ్డంగుల్లో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఆహార ధాన్యాల ఎగుమతి నిషేధించడం తెలివి తక్కువ పని. గిడ్డంగి నిల్వ కేవలం 6 శాతం మాత్రమే. దేశంలోని గిడ్డంగుల్లో 8.3 కోట్ల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. డిమాండ్‌ ఉన్నచోట అమ్ముకునే సౌలభ్యం రైతుకు ఉండాలి. ఆహార పదార్థాల విక్రయంపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు. అస్తవ్యస్త విధానాలతో రైతుల నడ్డి విరగ్గొడుతున్నారు. ప్రకృతి శాపం కంటే పాలకుల పాపం వల్లే రైతుకు ఆదాయం లేదు. మార్కెట్ యార్డుల్లో గుత్తాధిపత్యం నడుస్తోంది. నిత్యావసరాల చట్టం పేరుతో రైతులకు నష్టం కలిగిస్తున్నారు. రైతు, వినియోగదారుడి మధ్య ఆరుగురు దళారులు ఉన్నారు. దేశంలో పంటఉత్పత్తుల ప్రాసెసింగ్ 70 శాతానికి పెరగాలి."

- లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ

ఇదీ చూడండి : గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలి: కేటీఆర్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.