రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. సాయంత్రం 6 కాగానే పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంకా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇవాళ్టి నుంచి లాక్డౌన్ విరామ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించిన విషయం అందరికి తెలిసిందే. వాహనదారులు ఇళ్లకు వెళ్లడానికి మరో గంట అనగా... 6గంటల వరకు ప్రభుత్వం ప్రజలకు గడువిచ్చింది. సాయంత్రం 6 దాటిన అనంతరం లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. జంట నగరాల్లో పోలీసులు వాహనదారులను త్వరగా ఇళ్లకు వెళ్లాలని పంపిస్తున్నారు. మే 12వ తేదీ నుంచి పది రోజుల పాటు ఉదయం 6గంటల 10 గంటల వరకు అమలైన లాక్డౌన్ సడలింపులు... అనంతరం 9రోజుల పాటు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు అమలయ్యాయి. తాజాగా ఈ రోజు నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలింపులు ఇచ్చారు.
జంట నగరాల్లో సాయంత్రం 6దాటిన తర్వాత కూడా రోడ్లపై రద్దీ ఎక్కువగానే ఉంది. వాహనదారులంతా ఒకేసారి ఇళ్లకు బయలుదేరడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దీనికి తోడు అదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాహనదారులతో పాటు పోలీసులు ఇబ్బందులకు గురయ్యారు.
ఇదీ చదవండి: uttam kumar: రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద నిరసనలు