ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ సందర్భంగా జనాలు బయటకు రాకపోవడం వల్ల భాగ్యనగరంలో రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొంత మంది కనిపిస్తే వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ట్యాంక్ బండ్ వైపు వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారు. తప్పనిసరి అయితేనే అటుగా వెళ్లడానికి అనుమతిస్తున్నారు.
లిబర్టీ వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని వాహనదారులకు సూచిస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
కరోనా వైరస్ ప్రభావంతో బేగంపేట్ పరిసర ప్రాంతాలు జన సంచారం లేక బోసిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్యారడైజ్ మూసివేసిన కారణంగా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
తప్పనిసరి అయితేనే వాహనాలను అనుమతిస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిందని దీనికి ప్రజలంతా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఎయిడ్స్ మందులతో కోలుకున్న కరోనా బాధితుడు