నగరంలో మూడు రోజులుగా పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయని సీపీ అంజనీకుమార్ అన్నారు. అంబర్‌పేట్ పరిధిలో లాక్‌డౌన్ అమలు తీరును ఆయన పరిశీలించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జంట నగరాల్లో నిన్న ఒక్క రోజే 5 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబర్‌పేట్ పరిధిలో లాక్‌డౌన్ అమలు తీరును ఆయన పరిశీలించారు
ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదబాబాద్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. ప్రజలు మరింత సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని సీపీ వెల్లడించారు. నిన్న ఒక్క రోజే సుమారు 8 వేల వాహనాలు జప్తు చేశామని వెల్లడించారు. అత్యవసర సేవలు మినహా ఎవరూ బయటకు రావద్దని సీపీ అంజనీకుమార్ కోరారు.